గౌరీ లంకేశ్ హత్యవిషయంలో ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోకుండా నటుడు ప్రకాశ్ రాజ్ తన విలువ నిలబెట్టుకున్నారు. ఇంత దురంతం జరిగితే మోడీ మౌనంగా వుండటం సరికాదని ఆయన అన్నారు. ఆయన తనకంటే పెద్ద నటుడని కూడా వ్యాఖ్యానించారు. దీనికి గాను ఆయనపై కేసు కూడా వేశారు. ఇంత జరిగినా ప్రకాశ్ రాజ్ వెనక్కు తగ్గడం లేదు. మోడీ అంటే తనకు గౌరవం వుందని చెబుతూనే విభేదించే విషయాలు కూడా వున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఆయన దేశమంతటికీ ప్రధాని గనక కొన్ని విషయాల్లో తన వైఖరితో ఏకీభవించలేనని చెబుతున్నారు. అలాటి విషయాల్లో చేసిన విమర్శలు వెనక్కు తీసుకోబోనని తేల్చిచెప్పారు. ఒకోసారి ఏదో మాట్లాడినా తర్వాత వెనక్కు తగ్గి వివరణలు ఇచ్చేవారిలా ఆయన ప్రవర్తించకపోవడం అభినందనీయమే కదా.. విమర్శలకే కేసులు పెడితే జరిగేదేమో జరుగుతుంది. కాని ఈ పద్ధతి మాత్రం మంచిది కాదు.