జగన్ కోసం పని చేసి ఆయనను గెలిపించేందుకు ప్రయత్నించినందుకు ప్రశాంత్ కిషోర్ పశ్చాత్తాపం చెందుతున్నారు. ఇందులో జగన్ పాలన కారణం కాదు. తాను గెలిపించిన పార్టీ దారుణమైన పరిపాలన చేస్తుందని… ఆంధ్రప్రదేశ్‌ను కులాలు, మతాల ప్రాతిపదికన విడగొట్టి వారి… ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని కుప్పకూల్చేస్తోందని తెలుసుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేయలేదు. జగన్ కోసం పని చేసే బదులు కాంగ్రెస్ కోసం పని చేసి ఉంటే బీజేపీ కి ప్రత్యామ్నాయం తయారై ఉండేదని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ బలోపేతం అయ్యేదని చెబుతున్నారు. బీజేపీకి .. కాంగ్రెస్సే ప్రత్యామ్నాయయని ఆయన చెబుతున్నారు.
కాంగ్రెస్ పై పీకేకే మళ్లీ ఎందుకు అభిమానం వచ్చిందో తెలియడం లేదు కానీ.. భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందనతో సీన్ మారుతోందని పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ఆయన కనిపెట్టి ఉంటారని అందుకే మాట మార్చేస్తున్నారన్న అభిప్రాయం బీహార్‌లో వినిపిస్తోంది. జగన్ కోసం ఇప్పుడు కూడా పీకే టీం పని చేస్తోంది. ఆయన ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ.. ఆయన సూపర్ విజన్‌తోనే… ఐ ప్యాక్ మార్క్ వ్యూహాలు నడుస్తున్నాయి. ఫేక్ అకౌంట్లతో విజృంభిస్తున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య అధికార పార్టీనే చిచ్చు పెట్టే వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ నేర్పిన విద్యే.
తాను గతంలో పని చేసిన పార్టీలు తన పాదయాత్రకు ఆర్థిక సాయం చేస్తున్నారని పీకే నేరుగా చెప్పుకుంటున్నారు. ఇంత ప్రయోజనం పొందుతూ కొత్తగా కాంగ్రెస్ కు పని చేసి ఉండాలని పశ్చాత్తాపం వ్యక్తం చేయడం .. కాస్త వింతగానే ఉంది. బీహార్‌లో ఆయన చేపట్టిన పాదయాత్రకు ప్రజాదరణ ఉండటం లేదు. బీహార్ ప్రజలు ఆయనను నమ్మడం లేదు. జేడీయూ పార్టీని రీప్లేస్ చేయాలని … కాంగ్రెస్‌తో తాను పెట్టబోయే పార్టీతో కలిసి పోటీచేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారని అందుకే కొత్తగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు.