‘హనుమాన్’ తరవాత ప్రశాంత్ వర్మ సినిమా ఎవరితో అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. రణవీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్ ఖరారు చేశారని తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
‘బ్రహ్మరాక్షస’కు సంబంధించిన షూట్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోందని టాక్. హైదరాబాద్ శివార్లలో ‘హనుమాన్’ కోసం వేసిన సెట్లోనే ‘బ్రహ్మరాక్షస’ షూట్ మొదలైందట. అయితే ఇది గ్లింప్స్ కోసమే జరుగుతున్న చిత్రీకరణ అని సమాచారం. `బ్రహ్మరాక్షస` చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేటప్పుడు ఓ ప్రత్యేకమైన గ్లింప్స్ విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది. అందుకోసమే… ఈ షూటింగ్ ప్లాన్ చేశార్ట. రణవీర్ సింగ్ మాత్రమే ఈ షూటింగ్ లో పాలు పంచుకొంటున్నాడు. అయితే ఈ ఫుటేజీ ఏం సినిమాలో కనిపించదు. కేవలం గ్లింప్స్ కోసం తెరకెక్కిస్తున్న షాట్స్ మాత్రమే. ఇందుకోసం రణవీర్ సింగ్ 4 రోజులు కేటాయించాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తారు. అప్పుడే ఈ గ్లింప్స్ నీ చూడొచ్చు.