టెక్నీషియన్లందరి దృష్టీ మెగాఫోన్ పైనే ఉంటుంది. ఎందుంకంటే తనే కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి. కెమెరామెన్లు, రైటర్లు, డాన్సర్లు… వీళ్లంతా మెగాఫోన్ పట్టేయాలని ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ ఎడిటర్లు డైరెక్టర్లు కావడం చాలా అరుదు. ఇప్పుడు ప్రవీణ్ పూడి ఆ సాహసం చేస్తున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టారు ప్రవీణ్ పూడి. ఎడిటింగ్ విభాగంలో దిట్ట ప్రవీణ్ పూడి. ముఖ్యంగా ట్రైలర్లు కట్ చేయడంలో సిద్ధహస్తుడు. టాలీవుడ్ లో కాస్ల్టీ ఎడిటర్ గా పేరు తెచ్చుకొన్నారు. ఎడిటింగ్ ఎవరు చేసినా, ట్రైలర్ మాత్రం ప్రవీణ్ కట్ చేయాల్సిందే అనే పేరు తెచ్చుకొన్నారు. త్రివిక్రమ్ లాంటి దర్శకులకు బాగా ఇష్టుడు కూడా.
Also Read : ఒక్క రీమేక్… ఎందరో హీరోలు
ఎప్పటి నుంచో మెగాఫోన్ పట్టాలన్నది ప్రవీణ్ పూడి కల. ఇప్పుడు అది సాకారమైంది. ప్రవీణ్ పూడి దర్శకత్వంలో ‘బ్లడీ లవర్’ అనే సినిమా రూపొందుతోంది. హవీష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. లవ్ స్టోరీనే కానీ, ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారని సమాచారం. ఓ స్టార్ కథానాయికని హవీష్ పక్కన ఎంపిక చేయబోతున్నారు. హవీష్ ప్రస్తుతం ‘భాగమతి’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కావొచ్చింది. ఈలోగా `బ్లడీ లవర్` సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.