సొంత ఇల్లు ఓ కల. నెరవేర్చుకోవాలంటే ఎంత కష్టమో చెప్పాల్సిన పని లేదు. అందుకే అపార్టుమెంట్లో ఫ్లాట్‌ను బుక్ చేసే ముందు కొనుగోలుదారులు చాలా పరిశీలించాల్సి ఉంటుంది. ముందుగా కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ను పక్కాగా తెలుసుకోవాలి.
నమూనా ఫ్లాట్ ను బిల్డర్లు చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతారు. చేయి తిరిగిన నిపుణులతో సరిగ్గా ఏవి ఎక్కడ అమర్చాల్లో అక్కడ ఏర్పాటు చేయిస్తారు. దాంతో చూడముచ్చటగా ఉంటుంది. మంచి ఫర్నిచర్, తళతళ మెరిసే టైల్స్, చక్కని కప్ బోర్డులు, ఖరీదైన పంపులు, పంపు సెట్లు ఇలా ఏది చూసినా గానీ అహో అనిపిస్తుంది. దాంతో కొనుగోలు దారులు ముగ్ధులై బుక్ చేసేసుకుంటారు. వాస్తవానికి బిల్డర్ మొండిగోడల ఇల్లు మాత్రమే అందిస్తాడు. ఆ విషయాన్ని ముందుగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.
బిల్డర్ ఇచ్చే పత్రాల్లో ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్, కార్పెట్ ఏరియా, తదితర వివరాలుంటాయి. వాటిని చూసుకోవాలి. అగ్రిమెంట్ చేసుకనే ముందు ఇంటిని స్వాధీనం చేసే తేదీని కన్ఫర్మ్ చేసుకోవాలి. తమ పరిధిలోని లేని కారణాల వల్ల ఆలస్యం అయితే తమకు బాధ్యత లేదంటూ అందులో ఓ నిబంధన పెడతారు. తప్పించుకునే ప్రయత్నమే ఇది. ఒకసారి డౌన్ పేమెంట్ చెల్లించేస్తే ఇక అవి తిరిగి రావడం అన్నది అసాధ్యం. ఇల్లు కొనడానికి సిద్ధమైనప్పుడు ప్రయోజనాలు, ప్రతికూలతల గురించి ఓ పేపర్ పై రాసుకోవాలి. వాటిని ఎలా అధిగమించాలో.. కూడా అంచనాకు రావాలి. అప్పుడు మాత్రమే ముందడుగు వేస్తే.. ఆస్తి కొనుగోలులో వివాదాలు లేకుండా ముందడుగు వేయవచ్చు.