కీలకమైన నీతి ఆయోగ్ సమావేశంలోనూ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కేంద్రంలో కీలకంగా మారిన టీడీపీ అధినేత చంద్రబాబుకు సహజంగానే ప్రధాని మోడీ, బీజేపీ పెద్దల నుండి ప్రియారిటీ లభిస్తుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ లోనూ ఏపీకి భారీగా నిధులు దక్కగా, తాజాగా జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశంలో అదే రిపీట్ అయ్యింది.
నీతి ఆయోగ్ సమావేశంలో సీఎంలు పాల్గొన్నారు. ఎన్డీయే పక్షాల సీఎంలు హజరవ్వగా, ఇండియా కూటమి నుండి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బైకాట్ చేస్తున్నట్లు ఇది వరకే ప్రకటించారు.
Also Read : తిరుమలలో ప్రక్షాళన మొదలు… మంచి రోజులొచ్చినట్లే!
ఈ సమావేశంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడేందుకు కేవలం 5 నిమిషాల సమయమే దక్కింది. అదే సమావేశంలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దాదాపు 20నిమిషాల పాటు తన అభిప్రాయాలను పంచుకున్నారు. దీంతో మమతా బెనర్జీ అలిగి వెళ్లిపోయారు.
వికసిత్ భారత్-2047 ఎజెండాగా సీఎంలతో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతోంది. దీనికి కేంద్రమంత్రులు కూడా హజరయ్యారు.
ఈ సమావేశానికి సీఎంలు స్టాలిన్, రేవంత్ సహా మొత్తం ఆరుగురు ఇండియా కూటమి సభ్యులు బైకాట్ చేశారు.