హైదరాబాద్: మళయాళ ముద్దుగుమ్మలు ప్రియమణి, శరణ్య త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. పెళ్ళయిన కొత్తలో తదితర చిత్రాలలో గ్లామర్ పాత్రలతో ఒక ఊపు ఊపిన ప్రియమణి ప్రేమలో పడినట్లు కొంతకాలంగా అక్కడా, ఇక్కడా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు తన ప్రియుడి పేరును ఇప్పుడు బయటపెట్టింది. అతని పేరు ముస్తఫా రాజ్ అని, ముంబైలో ఈవెంట్ మేనేజర్ అని వెల్లడించింది. కొంతకాలంగా తాము ప్రేమించుకుంటున్నా ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని తెలిపింది. తమ పెళ్ళికి పెద్దలు అంగీకరించారని, త్వరలో తమ పెళ్ళి జరగనుందని చెప్పింది.
మరోవైపు విలేజ్‌లో వినాయకుడు వంటి చిత్రాలద్వారా తెలుగువారికి సుపరిచితురాలైన శరణ్యా మోహన్ వివాహ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. సినిమాలలో సంప్రదాయంగా కనిపించే శరణ్య నిజజీవితంలోకూడా అలాగే పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకోవటం విశేషం. అరవింద కృష్ణన్‌తో ఆమె వివాహం త్వరలో జరుగనుంది.