పుల్వామా దాడి ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేననే వాదన రోజు రోజుకు బలపడుతోంది. దాడి జరిగిన వెంటనే పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే వాదన బలంగా వినిపించడంతో .. ఆ దాడి వెనుక భద్రతా వైఫల్యం ఇతర విషయాలను పెద్దగా ప్రచారంలోకి రాలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ… అనేక అనుమానాలు లెవనెత్తుతూ… విపక్ష పార్టీలు .. మోడీని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మమతా బెనర్జీ, చంద్రబాబుతో పాటు.. కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నాయి.
గతంలో ఇలా జరిగినప్పుడు మన్మోహన్ రాజీనామా డిమాండ్ చేసిన మోడీ..!
ప్రతిపక్ష పార్టీలు.. పుల్వామా దాడి ఘటన జరగడానికి బాధ్యతగా… ప్రధాని నరేంద్రమోడీని డిమాండ్ చేయడానికి ఓ కారణం ఉంది. గతంలో కశ్మీర్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు… అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ.. కేంద్రంపైనే నిందలేసేవారు. చేతకాని ప్రభుత్వం అని మన్మోహన్ సర్కార్ పై విరుచుకుపడేవారు. మన్మోహన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసేవారు. అలా అప్పట్లో డిమాండ్ చేశారు కాబట్టే.. తన మాటలను.. తాను ఎందుకు ఆచరించరని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో నరేంద్రమోడీ… ప్రధానితో కలిసి వెళ్లలేదు. కానీ విమర్శలు చేశారు. కానీ.. బీజేపీ ఏమంటోంది… దేశం తీవ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలు దేశానికి.. ప్రధానికి అండగా నిలబడటం లేదని ఆరోపిస్తోంది. వారందా దేశద్రోహులు అంటున్నారు. ఈ డెఫినేషన్ ప్రకారం… అప్పట్లో .. బీజేపీ, నరేంద్రమోడీ కూడా దేశద్రోహి కదా..!. అప్పట్లో కేంద్రం విఫలమయిందన్న ప్రధాని మోడీ.. ఇప్పుడు ఎందుకు… తన మాటలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు..?. ఆ నిజాయితీ, నిబద్ధత, దేశభక్తి.. ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వర్తించవా అని.. ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇవి వ్యాలిడ్ క్వశ్చనే…!
అప్పట్లో కేంద్రాన్ని దూషించిన మోడీ ఇప్పుడు కలసి రాకపోతే దేశద్రోహులంటున్నారు..!
కానీ అప్పట్లో… ప్రధానమంత్రి రాజీనామా చేయాలన్న బీజేపీ నేతల డిమాండ్‌ను.. తిరస్కరించి.. విమర్శలు చేసిన వాళ్లే.. ఇప్పుడు రాజీనామా చేయమంటున్నారు. అప్పట్లో రాజీనామాకు డిమాండ్ చేసిన వాళ్లే.. ఇప్పుడు.. అలా అడిగిన వారిని దేశద్రోహులంటున్నారు. అప్పుడైనా.. ఇప్పుడైనా.. ప్రధానమంత్రిని రాజీనామా చేయాలనడం కరెక్ట్ కాదు. ఓ ప్రధానమంత్రి రాజీనామా చేయడం ద్వారా.. ఉగ్రవాదం తగ్గుతుంది అంటే.. రాజీనామాకు డిమాండ్ చేయవచ్చు. భారత ప్రధాని రాజీనామా చేయాలనేది..రాజకీయ డిమాండ్. జాతీయభద్రతకు సంబంధించిన అంశంపై రాజకీయాలు చేయాలనుకోవడం అర్థం లేని పని. ఒక వేళ నరేంద్రమోడీ రాజీనామా చేస్తే.. ప్రధానిగా… బీజేపీ నేతనే వస్తారు. రాహుల్ గాంధీనో.. చంద్రబాబునో..మరో నేతనో రారు కదా..! దీని వల్ల ప్రతిపక్షాలకు వచ్చే అడ్వాంటేజ్ ఏముంది..?. సీమాంతర ఉగ్రవాదాన్ని అణచి వేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని… ప్రజలకు తెలియచెప్పడానికి.. ఈ డిమాండ్లు చేస్తున్నారని అనుకోవాలి.
మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టేందుకే రాజీనామా డిమాండ్..!
ఉగ్రవాదదాడి జరిగినప్పుడల్లా… ప్రధానమంత్రి రాజీనామా చేయాలంటే.. ఆరు నెలలకో ప్రధానమంత్రి వస్తారు. పఠాన్ కోట్ తరహా ఉగ్రదాడి … జరిగినప్పుడూ.. ప్రధాని రాజీనామా చేయాలనే డిమాండ్ వచ్చేది. అలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా… ప్రధానమంత్రి రాజీనామా చేయాలంటే సాధ్యం. ఈ సమస్య అంతా.. గతంలో నరేంద్రమోడీ చేసిన డిమాండ్ వల్లే వచ్చింది. అప్పట్లో.. దేశ భద్రతతో కూడా ఆయన రాజకీయం చేశారు. అందుకే.. విపక్ష పార్టీలు .. ఇప్పుడు అదే కారణాను చూపి రాజకీయం చేస్తున్నాయి. మోడీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. అయితే… ప్రధాని మోడీ రాజీనామా చేసేయాలానేది.. విపక్ష పార్టీల అంతిమ లక్ష్యం కాకపోవచ్చు… ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారని అనుకోవచ్చు. దేశభద్రతపై పార్టీలు ఇలా రాజకీయాలు చేస్తూనే ఉంటాయి కాబట్టి.. ఇలాంటి ఘటనలు ఎప్పటికప్పుడు.. రాజకీయ అంశాలుగా మారిపోతున్నాయి.