దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన రాజ్ దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్లు కూడా టీడీపీ కూటమే గెలుస్తుందని చెబుతున్నారు. తాజాగా లోక్ నీతి సీఎస్డీఎస్ కు చెందిన సంజయ్ కుమార్ కూడా ఇదే చెప్పారు. ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించబోతోందని తేల్చారు.
లోక్ నీతి సీఎస్డీఎస్ సంస్థ పోల్ విశ్లేషణలో నిఖార్సైన సంస్థగా పేరు తెచ్చుకుంది. ఈ సంస్థ అధినేత సంజయ్ కుమార్ పోలింగ్ సరళిని విశ్లేషిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న ప్రముఖ సెఫాలజిస్టులు, ఎన్నికల నిపుణులు అందరూ ఏపీలో టీడీపీ కూటమి గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు. వైసీపీ నాలుగైదు అసెంబ్లీ స్థానాలకే పరిమితమని చెబుతున్నారు.
ఒకటో తేదీన చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. అందులో కూడా ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించబోతోందన్న రిజల్ట్ వస్తుందని ఈ సెఫాలజిస్టుల అభిప్రాయాలు చూస్తే అర్థమవుతుంది. వైసీపీ తరపున మీడియా చానళ్లలో బ్యాటింగ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ వంటి విశ్లేషకులు కూడా ఇదే చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీడీపీకి అనుకూలంగా వస్తాయని అంటున్నారు. కానీ వాళ్లంతా తనలా న్యూట్రల్స్ కాదని చెప్పుకొస్తున్నారు. ఆయన విశ్లేషణ ఆయనది.