సినిమాల్లో సంపాదించింది, మళ్లీ సినిమాకే పెట్టడం అందరికీ సాధ్యం కాదు. మళ్లీ ఎప్పటికైనా సినిమా వల్లే సంపాదించుకోవొచ్చన్న నమ్మకం ఉంటే తప్ప, అంత ధైర్యం చేయలేరు. పూరి ఈ విషయంలో గ్రేట్. ‘సినిమా హిట్టయినా సినిమానే తీస్తా, ఫ్లాప్ అయినా సినిమానే తీస్తా. మనకు తెలిసింది ఇదొక్కటే’ అంటూ ‘నేనింతే’ డైలాగ్ పూరి విషయంలో యాప్ట్. హిట్, ఫ్లాపులు అతన్ని కదిలించలేవు. కాకపోతే ఆస్తుల్ని కరిగిస్తాయింతే.
తన సినిమా హిట్టయి డబ్బులొస్తే, దాన్ని ప్రాపర్టీలుగా మార్చడం పూరికి అలవాటు. ఫ్లాప్ అయితే ఆ ప్రాపర్టీని అమ్మడం కూడా అంతే రొటీన్ వ్యవహారం. ఇటీవల పూరి నుంచి వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో అప్పులు మరింత పెరిగాయి. వాటిని క్లియర్ చేయడానికి షంషాబాద్ లోని ఓ విలువైన ప్రాపర్టీని పూరి అమ్మేశాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘డబుల్ ఇస్మార్ట్’ విడుదలకు ముందు రోజు పూరి ఆఫీసులో పెద్ద పంచాయితీ నడిచింది. పాత అప్పులు క్లియర్ చేయాల్సివచ్చింది. దాంతో షంషాబాద్ ప్రాపర్టీని అప్పటికప్పుడు రూ.18 కోట్లకు అమ్మేయాల్సివచ్చిందని తెలుస్తుంది. ‘డబుల్ ఇస్మార్ట్’ ని నైజాంలో విడుదల చేసిన నిరంజన్ రెడ్డి భారీగా నష్టపోయాడు. ఆ డబ్బుల్ని కూడా పూరి త్వరలోనే రిటర్న్ చేయాల్సివుంది. అందుకోసం కూడా పూరి మరో ప్రాపర్టీ తాకట్టు పెట్టబోతున్నట్టు సమాచారం.