రామ్ చరణ్ – శంకర్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా విడుదల తేదీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ చెప్పమంటే అటు దిల్ రాజు ‘నా చేతుల్లో లేదు’ అంటున్నారు. శంకర్ కూడా ‘ఇప్పుడే ఏం చెప్పలేను’ అని చేతులెత్తేశారు. దాంతో అసలు ఈ యేడాది ఈ సినిమా ఉంటుందా, లేదా? అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే ఎట్టకేలకు దిల్ రాజు ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు. క్రిస్మస్ కానుకగా ‘గేమ్ ఛేంజర్’ని విడుదల చేస్తామని ప్రకటించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన ‘రాయన్’ ప్రీ రిలీజ్ వేడుకలో దిల్ రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా చరణ్ ఫ్యాన్స్‌కు తీపి కబురు అందించారు. ‘క్రిస్మస్న తప్పకుండా కలుద్దాం’ అని అభిమానులకు మాట ఇచ్చారు. ఇప్పటికే డిసెంబరులో ‘పుష్ష 2’ వస్తోందని మైత్రీ మూవీస్ ప్రకటించింది. ఇప్పుడు అదే నెలలో చరణ్ సినిమా కూడా రానుంది. ‘పుష్ష 2’ డిసెంబరు 6న వస్తే.. 15 రోజుల వ్యవధిలో ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ చేస్తారు. నిజానికి డిసెంబరు సినిమాలకు మంచి సీజన్ కాదంటారు. కానీ ఈ యేడాది మాత్రం రెండు భారీ సినిమాలు డిసెంబరులోనే విడుదలకు సిద్ధమయ్యాయి.
Also Read : హాట్ టాపిక్: ‘పుష్ష’ విలాపం
‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఎంత వరకూ అయ్యింది? అనేదానిపై కూడా ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత లేదు. చరణ్ పార్ట్ పూర్తయ్యిందని శంకర్ చెప్పినా, ప్యాచ్ వర్క్ ఇంకా మిగిలే ఉందని సమాచారం. అందుకే చరణ్‌ని ఇంకా గేమ్ ఛేంజర్ గెటప్ లోనే కంటిన్యూ చేయమని చిత్రబృందం రిక్వస్ట్ చేసిందట. అందుకే చరణ్ తన తదుపరి సినిమా షూటింగ్ లోనూ పాలు పంచుకోవడం లేదు. ‘గేమ్ ఛేంజర్’ అయిపోగానే బుచ్చిబాబు సినిమా మొదలెట్టాల్సింది. కానీ శంకర్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో చరణ్ ఇంకా అదే గెటప్‌లో కొనసాగాల్సివచ్చింది.