డిసెంబరు 17న పుష్ప విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకి సంబంధించి అల్లు అర్జున్ డబ్బింగ్ కూడా మొదలెట్టేశాడు. ఓ పాట, కొంతమేర టాకీ బాకీ ఉంది. అవన్నీ ఈనెలాఖరుకి పూర్తయిపోతాయి. అయితే.. డిసెంబరు 17న పుష్ప రావడం డౌటన్నది చాలామంది నమ్మకం. ఎందుకంటే.. బన్నీ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అన్ని భాషల్లోనూ.. అవుట్ పుట్ తయారు చేయడం అంటే మాటలు కాదు. డబ్బింగ్ కే చాలా టైమ్ పట్టేస్తుంది. ఫైనల్ కంటెంట్ ఇవ్వడానికి చేతిలో ఉన్న సమయం పరిపోదన్నది అందరి అనుమానం. అయితే చిత్రబృందం మాత్రం డిసెంబరు 17న రావడం ఖాయమని గట్టిగా చెబుతోంది. అంకోసం రాత్రింబవళ్లూ కష్టపడుతోంది. అయితే సుకుమార్ మిస్టర్ పర్ఫెక్షనిజం చూపిస్తే… డిసెంబరు 17న పుష్ప రావడం కష్టమే. ఎందుకంటే సుకుమార్ కి ఏదీ ఓ పట్టాన నచ్చదు.ప్రతీదీ.. పర్ఫెక్ట్ గా రావాలనుకుంటాడు. అలానే ఈసినిమానీ చెక్కుతూ కూర్చుంటే… అనుకున్న సమయానికి ఈ సినిమా రావడం కష్టమవుతుంది. ఒకవేళ డిసెంబరు 17న పుష్ప రాకపోతే.. ప్రత్యామ్నాయంగా మరో డేట్ దొరకడం కూడా కష్టం అవుతోంది. అందుకే ఈ విషయంలో పుష్ప టీమ్ తర్జనభర్జనలు పడుతోంది.