సీఎంగా ఉండేవారికి ఏం సంబంధం అన్ని అధికారులే చూస్తారు… నా వాంగ్మూలం ఆధారంగా 14 ఏళ్లు చాలా బాగా పని చేసిన ముఖ్యమంత్రిపై కేసుపెట్టామనడం ఏమిటి ? అని మాజీ ఐఏఎస్ అధికారి.. నిన్నామొన్నటి వరకూ జగన్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన పీవీ రమేష్ చేసిన వ్యాఖ్యలు స్కిల్ కేసులో కొత్త సంచలనానికి కారణం అవుతున్నాయి. పీవీ రమేష్ వద్దన్నారంటూ.. ఆయనకు సంబంధించిన ఓ నోట్ ను వైరల్ చేస్తున్నారు. అయితే వర్జినల్ పోయిందని చెబుతున్నారు. ఈ అంశంపై పీవీ రమేష్ ఈటీవీకి ఇంటర్యూ ఇచ్చారు.
స్కిల్ స్కాం కేసులో అసలు చర్యలు తీసుకోవాలి అంటే ముందుగా అరెస్ట్ చేయాల్సింది స్కిల్ డెవలప్మెంట్ ఎండీ, కార్యదర్శిల పేర్లు ఎందుకు లేవని .. అసలు మొత్తం ఎండీ, కార్యదర్శిల పాత్రే ప్రధానం, వారి పేర్లు ఏవని పీవీ రమేష్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారిగా పనిచేశారు పీవీ రమేశ్ . ఇదే కేసులో సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు.. తన స్టేట్మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరమని.. తన వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్ చేశారనటం హాస్యాస్పదమని స్పష్టం చేశారు.
తాను అప్రూవర్ గా మారాననే ప్రచారం అవాస్తవమని… క్రిమినల్స్ , తప్పు చేసిన వాళ్లు మాత్రమే అప్రూవర్లుగా మారుతారన్నారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు? – స్కిల్ డెవలప్మెంట్ లో ఆర్థికశాఖ ఏ తప్పు చేయలేదని స్ప,్టం చేశారు. సీఐడీ తీరుపై అనుమానం కలుగుతోంది ..- నేను చెప్పింది సీఐడీ తమకు అనుకూలంగా మార్చుకుందని నా అనుమానమన్నారు. ఈ మొత్తం అంశంపై ఈటీవీకి ఇంటర్యూ ఇచ్చిన ఆయన తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కానీ తర్వాత రేపటికి వాయిదా వేశారు.
దీనికి కారణం సీఐడీ బెదిరింపులేనని భావిస్తున్నారు. వీపీ రమేష్ ఇంటర్యూ ఈటీవీలో గానే … సీఐడీ ప్రకటన చేసింది. పీవీ రమేష్ ఒక్క స్టేట్ మెంట్తోనే కేసు నడవలేదని పక్కా ఆధారాలున్నాయని చెబుతోంది. పీవీ రమేష్ స్టేట్ మెంట్ దర్యాప్తును ప్రభావితం చేసేది అవుతుందని హెచ్చరించింది. ఇప్పుడు పీవీ రమేష్ ను టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.