రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వెనుక పెద్ద స్కాం ఉందని.. కాంగ్రెస్ పార్టీతో పాటు.. ఇతర విపక్షాలన్నీ చేస్తున్న ఆరోపణలను.. ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టలేకపోతోంది. వారు లేవనెత్తుతున్న అనుమానాలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రజల్లో అనుమానాలు పెరిగిపోతూనే ఉన్నాయి. పైగా.. రోజు కో కొత్త సాక్ష్యం.. బయటకు వస్తోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం.. ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది.
సుప్రీంకోర్టుకూ అబద్దాలు చెప్పిన కేంద్రం..!
రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్.. అనేక ఆరోపణలు చేసిన తర్వాత.. మాజీ బీజేపీ నేతలు… సుప్రీంకోర్టులో అన్ని వివరాలతో పిటిషన్ వేశారు. విచారణకు ఆదేశించాలని కోరారు. దీన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కారణంగా ప్రభుత్వం… సుప్రీంకోర్టు.. రాఫెల్లో ఎలాంటి స్కామ్ జరగలేదని చెప్పిందని ప్రచారం చేసుకుంటూ… కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడికి దిగుతున్నారు. కానీ సుప్రీంకోర్టు చెప్పింది వేరు. సుప్రీంకోర్టు ఏమీ జరగలేదని చెప్పలేదు. సుప్రీంకోర్టు తీర్పులు చెబుతుంది కానీ.. విచారణ సంస్థ కాదు. దర్యాప్తులు చేయించదు. కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగానే సుప్రీంకోర్టు… తన అభిప్రాయాన్ని తెలియజేసింది. కేంద్రం సీల్డ్ కవర్లో సమర్పించిన ఆ అఫిడవిట్ ప్రకారం… రాఫెల్ డీల్ వ్యవహారాలన్నీ కాగ్‌కు ఇచ్చామమని.. కాగ్ ఆ పత్రాలను పరిశీలించి… నివేదిక సిద్ధం చేసి… పీఏకి ఇచ్చారని.. వారు కూడా .. పరిశీలించి.. ఈ పత్రాలన్నీ.. పబ్లిక్ డొమైన్లో పెట్టారని.. పేర్కొన్నారు. నిజానికి ఈ పత్రాలు ఏవీ పబ్లిక్ డొమైన్లో లేవు. అయినప్పటికీ.. ప్రభుత్వం.. ఈ విధంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ ఆధారంగా.. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే.. ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టుకే అబద్దం చెప్పింది. ఈ విషయాన్ని పీఏసీ చైర్మన్ గా ఉన్న మల్లిఖార్జున్ ఖర్గే బయటపెట్టారు. తమ ముందుకు ఎలాంటి రాఫెల్ నివేదిక రాలేదు. ఉన్నదని.. సుప్రీంకోర్టు ఎలా అంటుందని… ఖర్గే మండిపడ్డారు. అప్పుడు.. కేంద్రం… తప్పుగా అర్థం చేసుకున్నారంటూ.. ఎదురుదాడి ప్రారంభించారు. భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన సీల్డ్ అఫిడవిట్‌పై సంతకం చేయడానికి రక్షణశాఖ అధికారులు నిరాకరించారు. ఆ స్కాం తమపై పడుతుందన్న ఉద్దేశంతోనే.. వారు వెనుకడుగు వేశారు. ఇటీవలి కాలంలో హిందూ పత్రిక.. ప్రతి రోజూ… రాఫెల్ డీల్ వెనుక ఏం జరిగిందో.. రోజుకో కథనం ప్రచురిస్తోంది. రాఫెల్ డీల్‌ను పర్యవేక్షించే కమిటీకి సమాంతరంగా.. ప్రధానమంత్రి కార్యాలయం.. ఫ్రాన్స్ తో చర్చలు జరిపింది. అందుకే.. తాము సంతకాలు చేయబోమన్నారు. ఈ కారణాలుగా… తమకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటూంటే.. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.
రాఫెల్‌కు క్లియరన్స్ ఇచ్చిన అధికారే ఆడిటింగ్ చేస్తారా..?
ఇప్పుడు.. రాఫెల్ డీల్‌పై.. కాగ్ రిపోర్ట్ రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. ఇది ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. అయినా కూడా ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఉన్న వ్యక్తి… రాఫెల్ డీల్ సమయంలో ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలను రూ. 50వేల కోట్లకుపైగా ఎక్కువకు కొన్నారు. ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా.. ఏ ఒక్క కొనుగోలు చేయడం సాధ్యం కాదు. అంటే.. ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న సమయలో… ఇప్పుడు కాగ్‌గా ఉన్న వ్యక్తే… కొనుగోళ్లకు అనుమతులు మంజూరు చేశారు. అంటే… తన నిర్ణయాన్ని తానే ఎందుకు తప్పుపట్టుకుంటారు..?. దీన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ అంటారు. ఇది ఉన్నప్పుడు.. ఫైనాన్స్ సెక్రటరీగా అనుమతించి.. ఇప్పుడు తానే అడిట్ చేస్తే.. తప్పులు ఎలా బయటకు వస్తాయి..?
ధర తక్కువ, త్వరగా డెలివరీ అబద్దం..! మరి ఒప్పందం దేనికి..?
హిందూ పత్రిక బయట పెట్టిన అంశాల్లో చాలా కీలమైన విషయాలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. యూపీఏ ప్రభుత్వం జరిపిన చర్చలను… ప్రక్రియను మొత్తం పక్కన పెట్టేసి.. రద్దు చేసి కొత్త ఒప్పందం చేసుకున్నారు. ఆ సమయంలో… ఫ్రాన్స్‌తో చర్చలు జరిపిన భారత బృందంలోని ఏడుగురిలో ముగ్గురు.. ఓ ప్రత్యేమైన నోట్ ఇచ్చారు. దాని ప్రకారం… యూపీఏతో పోలిస్తే.. ఇప్పుడు చేసుకుంటున్న ఒప్పందం… దేశానికి నష్టదాయమని.. ఆ నోట్ సారాంశం. ఈ నోట్ ప్రకారం… గత ఒప్పందంతో పోలిస్తే… భారీ ఖర్చు… అలాగే.. డెలివరీ కూడా.. వేగంగా జరగదు. ఇప్పుడు కొత్తగా ఒప్పందం చేసుకోవడం వల్ల అనిల్ అంబానీకి లాభం జరుగుతుంది కానీ.. దేశానికి కాదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం… ముందుగా యుద్ధ విమానాలు వస్తాయని… ధర తక్కువని.. కేంద్రం వాదిస్తోంది. ఈ రెండూ తప్పే. క్లియర్ రఫెల్ ఒప్పందం.. దేశానికి నష్టమని.. నిపుణులు చెబుతున్నప్పటికీ.. పీఎంవో జోక్యం చేసుకుని ఒప్పందం చేసుకున్నారు. సమర్థించుకోవడానికి.. కొత్త వాదన వినిపిస్తున్నప్పటికీ.. కొత్త వాస్తవాలు వస్తున్నాయి. కొత్త వాస్తవాలు బయటకు వస్తున్న కొద్దీ..ప్రభుత్వం మరింతగా బుకాయింపులకు దిగుతోంది.