నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఈ సారి ఏ భయం లేకుండా ఆయన పర్యటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సారి ఆయన నేరుగా ప్రధానమంత్రితో పాటు పాల్గొనబోతున్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని మోదీ వస్తున్నారు. నియోజకవర్గ ఎంపీగా ఆయన కూడా పాల్గొనాల్సి ఉంది. దీంతో జూలై రెండో తేదీన ఆయన నియోజవకర్గానికి వస్తారు. ఇప్పుడు ఆయనను అడ్డుకోవడానికి అరెస్ట్ చేయడానికి ఎలాంటి అవకాశం ఉండదు.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు రెండున్నరేళ్లుగా పార్లమెంటరీ నియోజకవర్గం నర్సాపురంలో అడుగు పెట్టలేకపోతున్నారు. ఆయన అడుగు పెడితే.. ఏదో ఓ కేసు పెట్టించి అరెస్ట్ చేయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. గతంలో ఆయన ఓ సారి అలా పర్యటన షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు .. అప్పుడు నర్సాపురం మొత్తం అనేక కేసులు నమోదు చేశారు. అందులో అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయి. కోర్టుకెళ్లి ఎలాగోలా ఆ కేసుల నుంచి బయటపడినా… రకరకాల కేసుల్లో అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారన్న అనుమానంతో ఆయన నర్సాపురం వైపు వెళ్లడం లేదు.
తమ పార్టీ తరపున గెలిచి తమను ధిక్కరించారన్న ఆగ్రహంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనపై రకరకాల కేసులు పెడుతున్నారు. జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నారని.. నియోజకవర్గంలో అడుగుపెట్టనీయవద్దని ఆదేశించినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంమలో ఈ సారి ప్రధానితో పాటే ఆయనా పాల్గొననున్నారు ., మరి ఇందులో సీఎం జగన్ కూడా పాల్గొంటారా లేదా అన్నది స్పష్టత లేదు. ఒకే వేదికపై జగన్.. మోదీ.. రఘురామ కూడా ఉంటే.. రాజకీయ వర్గాల్లో ఉండే కిక్ వేరుగా ఉంటుంది.