ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటం లేకుండా నిర్వహించడం అభినందనీయమన్నారు. పెన్ష్ల పంపిణీకి మడకశిర సమీపంలోని కే గుండుమల గ్రామానికి చంద్రబాబు వెళ్లారు. జన సమీకరణచేయలేదు. అందుకే రఘువీరారెడ్డి అభినందించారు. గత ఐదేళ్లుగా జగన్ పర్యటనల హడావుడి చూసిన వారికి చంద్రబాబు సింపుల్ పర్యటనలు చాలా సంతృప్తినిస్తాయి. పొగడకుండా ఉండలేకపోతున్నారు. రఘువీరారెడ్డి కూడా అంతే. ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ అయినా చంద్రబాబును పొగిడేందుకు మనసులో మాటను దాచుకోలేకపోయారు.
జగన్ రెడ్డి జిల్లాలకు వెళ్తే జనమంతా ఇళ్లల్లో ఉండాలి. హెలికాఫ్టర్ లో వెళ్తే కింద ట్రాఫిక్ ఆపేయాలి. ఏ ఊళ్లో పర్యటిస్తారో ఆ ఊరంతా దుకాణాలు మూసేయాలి.. పరదాలు కట్టాలి.. అంతకు మించి… డ్వాక్రా మహిళలందరూ ఖచ్చితంగా జగన్ సభకు రావాల్సిందే. రాకపోతే బెదిరింపులు.. హెచ్చరికలు.. జరిమానాలు.. చివరికి వేధింపులు. డ్వాక్రా మహిళల్ని బలప్రదర్శన కోసం వాడుకోవడం ఆయనకే చెల్లింది. ఆయన తీరు చూసిన తర్వాత ఏ సీఎం అయినా ఇలాగే చేస్తారేమో అని భయపడ్డారు. కానీ చంద్రబాబు తన ప్రత్యేకత చాటుతున్నారు.
Also read : విదేశాలకు మకాం మార్చబోతున్న జగన్ ?
ఎక్కడా బలవంతంగా జన సమీకరణకు చాన్స్ ఇవ్వడం లేదు. ఎక్కడ పర్యటనకు వెళ్తే అక్కడి వారితోనే మాట్లాడుతున్నారు. భారారీగా అందర్నీ తోలుకొచ్చి బలప్రదర్శన చేయాలని అనుకోవడం లేదు. హంగూఆర్బాటాలు చేయడం లేదు. భద్రత పేరుతో హంగామా చేయడం లేదు. అందరితో కలిసిపోతున్నారు. నిజానిక ిఇది చంద్రబాబు స్టైల్. ఆయన గతంలోనూ అలాగే ఉండేవారు. కానీ జగన్ చేసిన అతితో.. చంద్రబాబు స్టైల్ ఎంత మంచిది అని ఆయనకు పొగడ్తలు లభిస్తున్నాయి. పక్క వాడు ఎంత వినాశకారుడో తెలిసిన తర్వాతే.. మంచి వాడి విలువ తెలుస్తుందన్నట్లుగా… జగన్ వ్యవహారం తేలిన తర్వాత చంద్రబాబు మరింత గొప్పగా అందరికీ కనిపిస్తున్నారు.