నవ్యాంధ్ర నడిబొడ్డున … విజయవాడలో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు. ఇది సాధారణమైన విషయం కాదు. ముఖ్యంగా హోదా కోసం.. తాము సర్వస్వాన్ని త్యాగం చేసి పోరాడామని… అందుకే.. కేసీఆర్ లాంటి వాళ్లు మద్దతిచ్చినా స్వాగతిస్తమని.. అదే పనిగా అభినందిస్తామని… అలా మద్దతిచ్చేవాళ్లను హీరోలుగా భావిస్తామని… వైసీపీ నేతలు పదే పదే చెప్పుకొచ్చారు. ఇప్పుడు నేరుగా.. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు… అదీ కూడా.. కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీ నేత. ఆయనే నేరుగా వచ్చి… ఏపీ నడిమధ్యన నిలబడి… ప్రత్యేకహోదా అమలు చేస్తామని చెప్పారు. మరి ఇలాంటప్పుడు… వైసీపీ నేతల స్పందన ఎలా ఉండాలి..! కేసీఆర్.. అవసరమైతే.. ప్రత్యేకహోదా ఇవ్వాలని… ప్రధానికి లేఖ రాస్తా అన్నారు. రాయలేదు. ఆ మాత్రం దానికే.. ఆయనను.. నెత్తి మీద పెట్టేసుకున్నారు వైసీపీ నేతలు. అలాంటిది మరి ఇప్పుడు రాహుల్ గాంధీకి.. ఎంత గౌరవం ఇవ్వాలి..?
నిజానికి ప్రత్యేకహోదాను.. కేసీఆర్ వ్యతిరేకించారు. ఏపీకి ఇస్తే తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. సోనియా గాంధీ ఎన్నికల ప్రచారంలో… భాగంగా మేడ్చల్‌లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే.. దాన్ని సెంటిమెంట్ పెంచడానికి వాడుకున్నారు. తెలంగాఇ ఇచ్చారనే గౌరవం లేకుండా.. ఆంధ్రతో కలిపి.. సోనియానూ విమర్శించారు. అప్పుడు.. వైసీపీ నేతలు కిక్కురుమనలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ మద్దతు కోసం.. జగన్ పార్టీ.. ఏపీలో గెలిచే పార్లమెంట్ సీట్లను.. తన ఖాతాలో వేసుకోవడానికి.. కేసీఆర్… ఓ బిస్కెట్ వేశారు. దాన్ని అందుకుని వైసీపీ… ప్రత్యేకహోదా కోసం .. కేసీఆర్ తో కలిసి కొట్లాడుతామని ప్రకటనలు చేస్తున్నారు.
టీఆర్ఎస్, వైసీపీ రెండు పార్టీలు… బీజేపీ అుకూల పార్టీలనీ.. దేశం మొత్తానికి క్లారిటీ ఉంది. ఏపీలో వైసీపీకి వచ్చే ఎంపీ సీట్లు… ఏపీ నుంచి ముందుగా టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తాయి.. ఆ తర్వాత బీజేపీ ఖాతాలోకి వెళ్తాయన్న విషయం.. అందరికీ మెల్లగా అర్థమైపోతోంది. ఇప్పుడు వైసీపీకి నిజంగానే ప్రత్యేకహోదా ఇంపార్టెంట్ అయితే.. హోదా ఇస్తామన్న కాంగ్రెస్ పట్ల సానుకూల ప్రకటన చేసి ఉండేది. కానీ.. అలాంటి ప్రయత్నమే చేయడం లేదు. సంబంధం లేదని.. టీఆర్ఎస్తో మాత్రం హోదా పేరుతో జత కడుతోంది.