టైమ్స్‌నౌ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రైమ్‌టైమ్ న్యూస్ యాంకర్ రాహుల్ శివశంకర్ రాజీనామా చేశారు. తన రాజీనామాను చానెల్‌కు అందజేశారు. ది శివశంకర్ ఎడిటోరియల్ గ్రూప్‌తో సహా చానెల్లోని అన్ని వాట్సాప్ గ్రూపుల నుండి తప్పుకున్నారు. శివశంకర్ ఆకస్మిక రాజీనామా, తన భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆయన రాజీనామా చేసినట్లుగా టైమ్స్ గ్రూప్ యాజమాన్యం ధృవీకరించింది. కొత్త ఎడిటర్ ఇన్ చీఫ్ గా నావికా కుమార్ ను నియమించారు.
రాహుల్ శివశంకర్ జర్నలిజం కూడా టైమ్స్ నౌ యాజమాన్యం కోరుకున్నట్లే ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో నావికా కుమార్ దూసుకెళ్తున్నారు. భారత్ కు అంతర్జాతీయంగా తలవంపులు తెచ్చిన ఓ ఘటనకు మొత్తం కారణం ఆమే. మతవిద్వేషాలు రెచ్చగొట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారని కేసులు నమోదయ్యాయి. రాహుల్ శివశంకర్ తర్వాత ఏం చేస్తారన్న దానిపై స్పష్టత లేదు.
అర్నాబ్ గోస్వామి (ప్రస్తుతం రిపబ్లిక్ వరల్డ్ అధినేత) ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నప్పుడు 2005లో శివశంకర్ టైమ్స్ నౌలో చేరారు. ఆర్నాబ్ డామినేషన్ తో .. 2013-2016 సమయంలో శివశంకర్ ఆ చానల్ని వదిలేసి, న్యూస్ X లో ఎడిటర్-ఇన్-చీఫ్ గా చేరారు. అయితే.. 2016లో గోస్వామి టైమ్స్ నౌ నుంచి వెళ్లిన తర్వాత అతను టైమ్స్ నౌకి మళ్లీ తిరిగి వచ్చారు. కానీ మళ్లీ నావికా కుమార్ దూకుడుగా బయటకు పోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.