ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాను అక్రమంగా యాక్సెస్ చేశారంటూ.. వైసీపీ నేత విజయసాయిరెడ్డితో పాటు లోకేశ్వర్ రెడ్డి అనే మరో వ్యక్తి ఇలా ఫిర్యాదు చేయడంతోనే అలా.. దాడులు చేయడం.. కలకలం రేపుతోంది. ఐటీ కంపెనీల సర్వర్లను స్వాధీనం చేసుకుని.. హార్డ్ డిస్కుల్లోని వివరాలు చెప్పాలంటే..ఉద్యగుల్ని.. అనధికారికంగా అదుపులోకి తీసుకోవడంపై తెలుగుదేశం పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తోంది. వైసీపీకి మేలు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ కంపెనీలను బెదిరించేలా చేసి.. ఏపీపై దాడికి పాల్పడుతోందని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఏపీ వ్యవహారాలపై తెలంగాణలో కేసు ఎలా నమోదు చేస్తారు..?
విజయసాయిరెడ్డి, లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తులు.. ప్రభుత్వ అధికారిక డేటా లీక్ అయిందనే ఫిర్యాదు చేశారు. దానిపై వారు.. టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్స్ , బ్లూ ఫ్రాగ్స్ అనే సంస్థలపై అనుమానం వ్యక్తం చేశారు. అప్పుడు పోలీసులు ఏం చేయాలి..? అసలు డేటా.. వారు అక్రమంగా సేకరించారో లేదో తెలుసుకోవాలి…? డేటా లీకయిందనడానికి అధారాలేమిటో అడగాలి..!. సంబంధిత ఏపీ అధికారులను సంప్రదించి… ఇలాంటి కేసు వచ్చిందని చెప్పాలి. అప్పుడే అధికారికంగా అవుతుంది. నిజంగా అలాంటి అనుమానాలు ఉన్నాయని సదరు అధికారులు చెబితే… కేసును వారికి బదిలీ చేయాలి. లేకపోతే.. వారి అనుమతితో అయినా దర్యాప్తు చేయవచ్చు. ఇవేమీ చేయలేదని.. టీడీపీ నేతలు.. పయ్యావుల కేశవ్, దూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. ఇది నేరుగా ఏపీ ప్రభుత్వంపై జరిగిన దాడిగా వారు అభివర్ణిస్తున్నారు.
ప్రాథమిక ఆధారాలు లేకుండా ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకుంటారా..?
సాధారణంగా ఇలాంటి కేసుల్లో.. పోలీసులు అంత అత్యుత్సాహం చూపరు. కచ్చితంగా.. ముందూ వెనుకా ఆలోచిస్తారు. ఎందుకంటే.. ఐటీ కంపెనీకి ఇమేజ్ ముఖ్యం. పోలీసులు ఇలాంటి పనులు చేస్తే.. ఐటీ కంపెనీల్లో దడ ప్రారంభమవుతుంది. ఉద్యోగుల్ని అనధికారికంగా అదుపులోకి తీసుకోవడాన్ని అసలు ఊహించలేవు. అందుకే..ఇప్పుడీ వ్యవహారం కీలకంగా మారుతోంది. సదరు ఐటీ కంపెనీ అధికారి తమ ఉద్యోగుల్ని పోలీసులు అనధికారికంగా అదుపులోకి తీసుకున్నారని.. కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
టీఆర్ఎస్, వైసీపీ చిక్కుల్లో పడ్డాయా..?
మరో వైపు టీడీపీని టార్గెట్ చేసుకుని.. ఏమైనా ఇలాంటి కేసులు, వ్యవహారాలు జరిగితే.. అటు టీఆర్ఎస్ మీడియా కానీ.. ఇటు సాక్షి మీడియా కానీ.. విస్తృతంగా ప్రచారం కల్పించి పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురిస్తుంది. కానీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు విషయంలో కానీ.. ఐటీ కంపెనీల సోదాల విషయంలో కానీ..చాలా గుంబనంగా వ్యవహరిస్తున్నారు చాలా తక్కువ విరవాలను మాత్రమే బయట పెడుతున్నారు. తెలంగాణ పోలీసుల్ని ఉపయోగించుకుని తమ డేటాను దొంగతనం చేయాడనికే.. వైసీపీ ఇలాంటి నాటకాలు ఆడుతోంది.. దీనికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందని… టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసు విషయంలో చాలా లూప్‌హోల్స్ ఉండటంతో… మరింత డ్యామేజ్ జరగకుండా… అటు టీఆర్ఎస్.. ఇటు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నాయని.. అందుకే పెద్దగా ప్రచారం చేయడం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.