హీరో రాజ్ తరుణ్ పై నెలకొన్న వివాదం అందరికీ తెలిసిందే. పదేళ్ళు సహజీవనం చేసి, పెళ్లి కూడా చేసుకొని, ఇప్పుడు తనని కాదని ఓ హీరోయిన్ తో రిలేషన్ లో వున్నారని లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ వివాదం రోజుకో మలుపు తిరిగింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత హీరో రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చారు. తన తాజా సినిమా తిరగబడరాసామి ప్రీరిలీజ్ ఈవెంట్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు.
ముందుగా ఇదే టాపిక్ పై వివరణ ఇచ్చారు. ”జరిగింది అందరికీ తెలుసు. నాపై చేసినవన్నీ అరోపణలే. ఒక వ్యక్తిపై ఇంత నిరాధారంగా ఆరోపణలు చేయడం అన్యాయం. నేను ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి అనేది నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. ఈ విషయం నా మొదటి సినిమా నుంచి చెబుతున్నాను. కానీ మనలోని మంచితనాన్ని కొందరు తప్పుగా వాడుకుంటారు. నేను కూడా చాలా ఆరోపణలు చేయొచ్చు. కానీ ఈ విషయంలో నేను న్యాయపోరాటం చేస్తాను. నా దగ్గర అన్నీ ప్రూఫ్స్ వున్నాయి. ఆరోపణలకు భయపడే పరిస్థితి లేదు’ అని చెప్పుకొచ్చారు రాజ్ తరుణ్.