అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఇండియాటుడే చానల్ హెడ్ రాజ్ దీప్ సర్దేశాయ్ ముగ్గురు ప్రధాన నేతల్ని… ఇంటర్యూ చేశారు. ఏపీకే వచ్చారు. ముగ్గురు ప్రధాన నేతల ఇంటర్యూలను ప్రయారిటీ ఇచ్చి టెలికాస్ట్ చేశారు. ఆ ఇంటర్యూలు చూసిన తర్వాతా జాతీయ పార్టీల నేతలకు కూడా ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏపీలో ఏం జరిగిదో అన్నదానిపైన. ఎందుకంటే ఏపీ ప్రజలకు కొత్తగా నిరూపించాల్సిందేమీ లేదు.
విజన్ ఆవిష్కరించిన చంద్రబాబు
రాజ్ దీప్ సర్దేశాయ్ మొదట చంద్రబాబును ఇంటర్యూ చేశారు. అరగంట పాటు సాగిన ఇంటర్యూలో చంద్రబాబు తన విజన్ ను మరోసారి ప్రజల ముందు ఉంచారు. ఏపీకి జగన్ చేసిన నష్టంతో పాటు తాను ఎలా గాడిన పెట్టాలనుకున్నది వివరించారు. అదే సమయంలో అధికారంలోకి రాగానే పగ సాధిస్తారా అన్న ప్రశ్నకు .. అలాంటి రాజకీయాలు తాను చేయబోనని క్లారిటీ ఇచ్చారు. అయితే చేసిన తప్పులకు చట్టపరమైన శిక్షలు అనుభవించాల్సిందేనని తేల్చారు. జాతీయ రాజకీయాలు, ఎన్డీఏ కూటమిలో చేరడం ఇలా ప్రతి అంశంపై స్పష్టత ఇచ్చారు. ఈ ఇంటర్యూ ఇండియా టుడేలో వైరల్ అయింది. అరగంట సేపు ప్రత్యేకంగా టెలికాస్ట్ చేశారు.
జోష్ గా సాగిన పవన్ ఇంటర్యూ
రాజ్ దీప్ సర్దేశాయ్ పవన్ కల్యాణ్ ను కూడా ఇంటర్యూ చేశారు. ఆయన ప్రచార వాహనంలో జరిగిన ఇంటర్యూలో రాజ్ దీప్ .. పవన్ పొలిటికల్ ఆలోచనల్ని బయటకు రప్పించారు. తాను సినిమా స్టార్ ని అయిన .. రాజకీయంగా తన ఆలోచనలు ఎలా ఉంటాయో వివరించారు. రాజ్ దీప్… స్టార్లను చూసేందుకు జనం వస్తారు కానీ ఓట్లేయరని ఎన్ని సార్లు కార్నర్ చేసే ప్రయత్నం చేసినా రాజకీయంగా తెలివైన సమాధానాలు ఇచ్చారు. జగనమోహన్ రెడ్డిపాలన వైఫల్యాలు.. రాజ్యాంగ ఉల్లంఘన పాలనపైనా గట్టిగా చెప్పారు. అదే సమయంలో ఆ ఇంటర్యూను ఉత్సాహంగా ఇల్లాసంగా నిర్వహించడంలో రాజ్ దీప్ ప్రత్యేకత చూపించారు. ఈ ఇంటర్యూ కూడా వైరల్ అయింది.
జగన్ అహంకారపు సమాధానాలు
సీఎం జగన్ కూడా రాజ్ దీప్ కు ఇంటర్యూ ఇచ్చారు. అయితే ప్రతి సమాధానం అహంకారంతో కూడుకున్నదే. వివేకా హత్య కేసుపై ప్రశ్నలు అడగకుండా చూసుకున్నారు. తన ప్రతి చేతకాని తనాన్ని చంద్రబాబుపైకి నెట్టారు. సొంత చెల్లి చంద్రబాబు రిమోట్ కంట్రోల్ లో ఉందని ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పుకున్నారు. ఆమెకు డిపాజిట్ రాదన్నారు. తాను జనం ఖాతాలో డబ్బులేశాను కాబట్టి తనకు ఓట్లేస్తారన్నట్లుగా చెప్పుకొచ్చారు. పెద్ద పరిశ్రమలు, పెట్టుబడుల వల్ల ఏమి ఉపయోగమని ప్రశ్నించి రాజ్ దీప్ ను మూర్చబోయేలా చేశారు. ఇలాంటి విచిత్రాలు ఇరవై నిమిషాల ఇంటర్యూలో చాలా ఉన్నాయి.
రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన మూడు ఇంటర్యూలను చూసిన ఎవరికైనా… ఓ క్లారిటీ వస్తుందనడంతో సందేహం ఉండదు.