రాజకీయాల్లోకి వచ్చే విషయమై తర్జన భర్జనలు పడుతున్న రజనీకాంత్ ఒక చిన్న ముందడుగు వేసాడు. రజనీ పేరవై పేరుతో వెబ్ సైట్ ఏర్పాటు చేసాడు.
రజనీ పేరవై పేరుతో ఏర్పాటైన వెబ్ సైట్ లో అభిమానులు రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే రిజిస్టర్ చేసుకునేటపుడు పేరు ఫోన్ నంబర్ తో పాటు కావాలనుకుంటే ఓటర్ ఐడి నంబర్ కూడా ఇవ్వచ్చు. ఇక రజనీ ఫ్యాన్స్ అందరూ ఇందులో సభులుగా చేరాల్సిందిగా కోరిన రజనీ ఫ్యాన్స్ అధ్యక్షులు, ఒక్కొక్కరు మరో పది మందిని కూడా ఇందులో చేర్పించాల్సిందిగా విఙ్ఞప్తి చేసారు. రజనీ గురించిన పొలిటికల్ అప్ డేట్స్ ఈ సైట్ ద్వారా సభ్యులు తెలుసుకోవచ్చు.
దసరా రోజు ప్రారంభమైన ఈ సైట్ కి ఎలాంటి ఆదరణ వస్తోందో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. కానీ రజనీ పాలిటిక్స్ లోకి ఖచ్చితంగా వస్తున్నాడని మాత్రం ఇలాంటి వాటి వల్ల బాగా నిర్ధారణ అవుతొందీ మధ్య.