పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ .. సమాజ్ వాదీ పార్టీ నాయకురాలు జయా బచ్చన్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో తనను జయా అమితాబ్ బచ్చన్ అని పిలవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ..తనకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
జయా బచ్చన్ వైఖరిపై ధన్ ఖడ్ కూడా అదే శైలిలో సమాధానం ఇచ్చారు. నాకు పాఠాలు బోధించవద్దు..అని అనడంతో సభలో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో జయా బచ్చన్ కు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మద్దతుగా నిలిచారు. చైర్మన్ వైఖరి సభ్యులను అవమానించేలా ఉందంటూ విపక్షాలు వాకౌట్ చేశాయి.
Also Read : రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు- హైకోర్టులో కీలక విచారణ
తన విషయంలో చైర్మన్ వ్యాఖ్యలను నిరసిస్తున్నాను. మీరు సెలబ్రిటీ అయితే నాకేంటి అని మాట్లాడుతుంటారు. నన్ను సెలబ్రిటీగా గుర్తించాలని చైర్మన్ ను కోరడం లేదు..ఐదు సార్లు రాజ్యసభకు ఎంపికయ్యాను..సభలో ఏం మాట్లాడాలో నాకు తెలియదా..? తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై చైర్మన్ క్షమాపణలు చెప్పాలని జయా బచ్చన్ డిమాండ్ చేశారు.
గత నెలలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా జయా అమితాబ్ బచ్చన్ అని పిలవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందని అన్నారు. అయితే , రికార్డ్ లో ఇలాగే ఉందని డిప్యూటీ చైర్మన్ సమాధానం ఇచ్చారు. భర్త పేరు ఉంటేనే మహిళలకు గుర్తింపు వస్తుందా..? మహిళలు స్వతంత్రంగా ఉంటే గుర్తింపునివ్వరా అంటూ జయా బచ్చన్ ప్రశ్నించారు.