ఈమధ్య మెగా కాంపౌండ్‌తో రాసుకుపూసుకొని తిరుగుతున్నాడు రాజమౌళి. ఈ రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరిందని, రాజమౌళి దర్శకత్వంలో మరో మెగా సినిమా రాబోతోందని డప్పు కొట్టారంతా. సుకుమార్‌తో సినిమా ముగిసిన వెంటనే రాజమౌళి సినిమా ఉంటుందని, కాని పక్షంలో 2018 – 2019 మధ్యలో వీరిద్దరి సినిమా రావడం ఖాయమని చెప్పుకొన్నారు. అయితే.. మెగా కాంపౌండ్‌లో రాజమౌళి సినిమాకి ఛాన్సే లేదని తెలిసిపోయింది. అసలు రామ్ చరణ్ తో గానీ, చిరంజీవితో గానీ సినిమా చేసే ఆలోచన ఏదీ రాజమౌళికి లేదని… జక్కన్న సన్నిహిత వర్గాలు తేల్చేశాయి.
”రామ్ చరణ్‌తో రాజమౌళి సినిమా అనేది కేవలం పుకారే. రామ్ చరణ్ ని `రంగస్థలం` సెట్లో కలసినప్పటికీ అది కేవలం మర్యాద పూర్వకమైన సందర్శనే. కథ చర్చలు గానీ, సినిమా చేద్దామన్న మాటలు గానీ వాళ్ల మధ్య రాలేదు. తన తదుపరి సినిమా పనుల్ని రాజమౌళి ఇటీవలే ప్రారంభించారు. అందులో రామ్ చరణ్ హీరో కాదు” అని రాజమౌళి సన్నిహితుడు ఒకరు తేల్చి చెప్పేశారు. సో… చరణ్‌తో రాజమౌళి సినిమా అనేది కేవలం గాసిప్ మాత్రమే. అయినా చరణ్ కూడా ఏం ఖాళీగా లేడు. బోయపాటి శ్రీను సినిమా పూర్తయిన వెంటనే, కొరటాల శివ సినిమా మొదలవుతుంది. ఈ రెండు సినిమాలూ పూర్తయ్యే సరికి ఓ రెండేళ్లు పట్టొచ్చు.