మెగా బ్రదర్ కూతురు నిహారిక తెరంగేట్రానికి రంగం సిద్ధమవుతుంది. అయితే దీనికి మెగా ఫ్యామిలీ నుండి ఎవరెవరు ఓకే చెప్పారన్న సందేహం ఉండేది. పవర్ స్టార్ కి నిహారికను హీరోయిన్ చేయడం ఇష్టం లేదని వార్తలు వస్తున్నాయి. అయితే బ్రూస్ లీ ప్రమోషన్లో బిజీగా ఉన్న చరణ్ మాత్రం తన చెల్లి నిహారిక ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా నిహారికా ఎంట్రీ ఇవ్వడం మంచి విషయమే అని. తను ఎలాంటి సినిమాలు చేయాలి అనేది బాబాయ్ చూసుకుంటారు అన్నాడు.
నిహారిక సినిమాల ఎంట్రీపై మాకు ఎలాంటి ఇబ్బంది లేదు బాబాయ్ ఓకే అన్నాడు కాబట్టి ఇక అంతా ఆయనే చూసుకుంటారు అన్నాడు. గారాలపట్టిగా ఇంట్లో పెరిగిన మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక మొన్నటిదాకా బుల్లితెరలో తన హవా కొనసాగించింది. మధురా శ్రీధర్, టివి-9 కలిసి నిర్మిస్తున్న ‘ఒక మనసు’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.
అమ్మడికి భారీ రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారని టాక్. సినిమాకు మెగా ఫ్యాన్స్ ఎట్రాక్ట్ అవుతారు కాబట్టి ఆమెకు ఫ్యాన్సీ ఫిగర్ ఆఫర్ చేశారట. సో మొత్తనికి స్టార్ హీరోల కొడుకులే కాదు కూతుళ్లు కూడా హీరోయిన్ అవుతారని ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది నిహారుక కొణిదెల.