టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఏపీలో ఆలయాల పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీలోని ఆలయాల్లో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని.. ఆలయ అధికారులు వారి ప్రణాళికలు, వారి కల్పనలు అమలు చేస్తున్నారని ఆరోపిచారు. ప్రముఖులకు., పారిశ్రామిక వేత్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయంగా మారింది అంటూ రమణ దీక్షితులు. ట్వీట్ చేశారు. తమిళనాడు ఆలయాల్లో పరిస్థితులపై ఓ తమిళనాడు భక్తుడు పట్టిన ట్వీట్‌కు స్పందిస్తూ.. ఏపీలోనూ అలాగే ఉందన్నారు.
రమణదీక్షితులు లెక్క ప్రకారం ఏపీలో అసలు ఆలయాల్లో పూర్తి స్థాయిలో దేవుడ్నిలెక్క చేయడం మానేశారు. ఆగమ శాస్త్రాలను పట్టించుకోవడం లేదు. మరి ఇంత జరగుతున్న ఆయన కేవలం ట్వీట్ రిప్లయ్ లకే ఎందుకు పరిమితమయ్యారన్నది ఆయనకే తెలియాలి. టీటీడీ ఆగమ శాస్త్ర సలహాదారుడు కూడా ఆయనే. మరి అలాంటప్పుడు చర్యలు తీసుకోవచ్చు కదా అంటే.. ఆయన దగ్గర సమాధానం ఉందో లేదో ఎవరికీ తెలియదు.
టీటీడీ ప్రధాన అర్చకుడిగా … శ్రీవారికి రోజూ పూజలు చేసే భాగ్యం దక్కించుకున్న ఆయన… శ్రీవారి ఆలయప్రతిష్ట మంటగలిపేలా తప్పుడు ఆరోపణలు రాజకీయ పరంగా చేశారు. పింక్ డైమండ్.. పోటులో తవ్వకాలు అంటూ.. దారుణమైన అభాండాలు వేశారు. దానికి ఆయన పదవి పోయింది. ఆయన ఎవరిని నమ్ముకుని ఆ ఆరోపణలు చేశారో వారిప్పుడు నట్టేట ముంచేశారు. చివరికి పదవి పోయింది.. ఆలయంలోకి రానిచ్చే వారు లేకుండా పోయారు. దీంతో ఆయన ప్రభుత్వంపై ఇలా అసంతృప్తి ట్వీట్లు వేస్తూ టైం పాస్ చేసుకుంటున్నారు.