రాజకీయాల కోసం తన గౌరవాన్ని, పదవిని పోగొట్టుకుని ఏదీ దొరక్క కిందా మీద పడుతున్న టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు.. కనీసం తన పదవిని అయినా మళ్లీ పొందాలని ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్ మాత్రం పట్టించుకోవడవం లేదు. గత ఎన్నికలకు ముందు పింక్ డైమండ్, పోటులో తవ్వకాలు అంటూ ఓ పకడ్బందీ స్క్రిప్ట్ ప్రకారం ఆరోపణలు చేశారు రమణదీక్షితులు. అప్పుడు ఆయన టీటీడీలో ప్రధాన అర్చకుల హోదాలో తిరుగులేని స్థానంలో ఉన్నారు.
అయితే విచారణ జరిపి తప్పుడు ఆరోపణలు చేశారని కేసులు, అరెస్టులు లాంటి ఆలోచనలు ఇప్పటి ప్రభుత్వంలాగా అప్పటి ప్రభుత్వం చేయలేదు. కానీ ఆయన ప్రధానార్చక పదవికి రిటైర్మెంట్ ఇచ్చేసింది. ఆ వెంటనే.. నిలువెత్తు శిలువ ఉండే లోటస్ పాండ్ కు వెళ్లి జగన్ దగ్గర హామీ పొందారు రమణదీక్షితులు. తన ప్రధానార్చక పదవి తనకు ఇచ్చేలా హామీ పొందారు. రమణదీక్షితుల పింక్ డైమండ్, పోటులో తవ్వకాల ఆరోపణలు చంద్రబాబు ప్రభుత్వానికి గట్టిగానే తగిలాయి. ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా అవన్నీ ఉత్తుత్తి ఆరోపణలేనని నిజం లేదని తేల్చింది.
అది అందిరకీ తెలిసిన విషయమే కానీ దీన్ని రాజకీయం చేసి వైసీపీకి లబ్ది చేకూర్చిన రమణదీక్షితులు మాత్రం ఇప్పటికీబాధితులుగానే ఉండిపోయారు. ఆయనకు తన ప్రధాన అర్చక పదవి ఇస్తారనుకుంటే.. ప్రతీ సారి ఓ పని లేని పదవిని జీవో రూపంలో ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ప్రస్తుతం లఆయన శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు హోదాలో ఉన్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు.
తనపదవి తనకు వచ్చేలా చేయడానికి వంశపారం పర్య అర్చకుల సమస్యకు పరిష్కారం దొరకాలని ఆయన అంటున్నారు. వంశపారం పర్య అర్చకుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ శివశంకర్ కమిటీ నివేదికను బయట పెట్టాలని ఆయన కోరుతున్నారు. రెండేళ్ల కిందట కమిటీని నియమించినా, నేటికి ఆ నివేదిక బయట పెట్టలేదని అంటున్నారు. నేరుగాజగన్ అపాయింట్ మెంట్ దొరకడం ఇప్పుడు సాధ్యం కాబట్టి ఆయన ట్విట్టర్ ద్వారా వేడుకుంటున్నారు. కానీ పట్టించుకునేవారేలేరు. ప్రభుత్వం మారితే తన పరిస్థితేమిటని ఆయన ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తున్నారు.