మీరు ఓ కేటగిరీకి ఇనిస్పిరేషన్ సార్ అంటూ కొంత మందిని వెటకారం చేస్తారు కానీ.. ఆ కేటగిరీ వారికి మాత్రం… వారెప్పుడూ స్పెషలే. జగన్ కూడా అలాంటి జాబితాలోకి వస్తారు. లేని.. రాని ప్రతిపక్ష హోదా కోసం ఆయన కోర్టులో పిటిషన్ వేసినప్పుడు అందరూ విచిత్రంగా చూశారు. నిజంగానే ఆయన ఓ కేటగిరీని ప్రేరణ అనుకున్నారు. ఆయన ను స్ఫూర్తిగా తీసుకున్న వారిలో శ్రీవారి మాజీ ఆలయ ప్రధాన ఆర్చకులు రమణ దీక్షితులు కూడా ఉన్నారు. తనను ప్రధాన అర్చకుడిగా గుర్తించాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రమణదీక్షితులను గౌరవ ప్రధాన అర్చకులుగా జగన్ ప్రభుత్వం నియమించింది. కానీ ఆయనకు ఆలయంలో ప్రాధాన్యం లభించలేదు. తనను ప్రధాన అర్చకులుగా నియమించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జగన్ ఆయనకు ఆ మేరకు హామీ ఇచ్చారు కానీ చివరకు వచ్చే సరికి కేసులు పెట్టి అరెస్టు చేయించాలని ప్రయత్నించారు. కోర్టును ఆశ్రయించి ఎలాగోలా అరెస్టు నుంచి తప్పించుకున్నారు కానీ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. టీడీపీ ప్రభుత్వం రావడంతో ఇప్పుడు మళ్లీ తన ప్రధాన అర్చక పదవి తనకు ఇవ్వాలని కోర్టులకు వెళ్తున్నారు.
Also Read : టీటీడీకి కొత్త బోర్డు… ఆలస్యానికి అసలు కారణం ఇది!
నిజానికి రమణదీక్షితులు 2019కి ప్రధాన అర్చకుడిగా శ్రీవారి ఆలయాన్ని గుప్పిట పట్టేసుకుని ఉండేవారు. కానీ రాజకీయ కుట్రల్లో భాగంగా చంద్రబాబుపై పోటు తవ్వకాలు, పింక్ డైమండ్ అంటూ.. ఆరోపణలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టారు. ఆయన తీరుతో వెంటనే ఆయనకు ప్రభుత్వం రిటైర్మెంట్ ఇచ్చేసింది. దాంతో పదవి పోయింది. జగన్ ఆయన పదవి ఆయనకు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక జైలుకు పంపే ప్రయత్నం చేశారు. అయినా ఆయన ప్రతిపక్ష నేత హోదా కోసం కోర్టుకెళ్లగా లేనిది తాను ప్రధాన అర్చక పదవి కోసం వెళ్లకూడదా అని.. జగన్ నే స్ఫూర్తిగా తీసుకుని కోర్టు పోరాటం ప్రారంభించారు.