మరో వైసీపీ ఎమ్మెల్యే జగన్ కు షాక్ ఇచ్చారు. మరో 2 రోజుల్లో పాదయాత్ర కు జగన్ సిద్దమవుతున్న క్రమంలో…ప్రారంభమైన ఈ వలసలు కూడా యాత్ర రూపం తీసుకొనున్నాయని ఠె.దే. పా వర్గాలు చెబుతున్నాయి.
రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి వైకాపా కు గుడ్ బై చెప్పారు. శనివారం చంద్రబాబు సమక్షంలో తేదేపా కండువా కప్పుకున్న ఈ ఎమ్మెల్యే… నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు చెప్పారు. ఈ కారణం పాతదే అని, అందరూ చెప్పిందే అని లైట్ తీసుకొనక్కర్లేదు. తమ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదు అని తీసుకున్న నిర్ణయం తనకు నచ్చకపోవడం కూడా మరొక కారణంగా ఆమె చెప్పుకొచ్చింది. తన నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. సో… వైసీపీ నుంచి జంప్ అవుతూ చెప్పుకోవడానికి ఎమ్మెల్యేలకు మరో గొప్ప కారణం అందుబాటులోకి వచ్చింది… బహుశా… ఇది వచ్చింది అనడం కన్నా వైసీపీ తనే ఇచ్చింది అనడం కరెక్టుగా ఉంటుంది.
ఏదేమైనా… పాదయాత్ర ప్రారంభించే 6 వ తేదీన మరిన్ని వలసల తో జగన్ శిబిరాన్ని అయోమయంలో పడేసే గేమ్ ప్లాన్ టీడీపీ రెడీ చేసిందని సమాచారం.