రాజకీయం అంటే రాజకీయం. దానికి మంచీ చెడూ ఉండదు. రాజకీయ పార్టీ నాయకులకూ ఈ లక్షణాలు ఉండవు. కనీసం మానవత్వం మంచితనం.. తాను ఈ పొజిషన్లో ఉండటానికి ఫలానా వారే కారణం అనే మొహమాటలు అసలు పెట్టుకోరు. దానికి తాజా సాక్ష్యం రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావే.
2014 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రాపాక వరప్రసాద్ కు … ఆయన కుటుంబసభ్యులు కూడా ఓట్లేయలేదు. మొత్తం మూడు వందల ఓట్లే వచ్చాయి. ఎమ్మెల్యేగా లేనప్పుడు ఇంట్లో శుభకార్యం పెట్టుకుంటే వెయ్యి మంది వచ్చే వారు. కానీ ఆయనకు వచ్చిన ఓట్లు మూడు వందలు. ఇంత పలుకుబడి ఉన్న ఆయనకు జనసేన పార్టీ టిక్కెట్ ఇచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచారు. దీని కంటే ముందు ఆయన వైసీపీలో పని చేశారు.
నాలుగున్నరేళ్ల పాటు రాజోలు నియోజవకర్గంలో వైసీపీలో పని చేస్తే చివరికి జగన్ హ్యాండిచ్చారు. టిక్కెట్ ఇచ్చేదిలేదని చెప్పారు. అన్ని రకాలుగా ఖర్చు పెట్టుకుని జగన్ నే నమ్ముకున్న ఆయన సర్వం కోల్పోయి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్థితిలో పవన్ కల్యాణ్ ఆదుకున్నారు. గెలిచే సీటు అని తెలిసినా రాపాకకు ఇచ్చారు. ఎంత ఒత్తిళ్లు వచ్చినా పవన్ రాపాక కోసం నిలబడ్డారు. కానీ ఏం జరిగింది.. ఇప్పుడు పవన్ నే అడ్డగోలుగా తిడుతున్నారు రాపాక. అంతేనా.. తనను మోసం చేసిన జగన్ ను దైవ సమానులంటున్నారు.
ఇంట్లో పెళ్లి ఉంటే శుభలేఖ మీద జగన్ దంపతుల ఫోటోలు వేసి దైవసమానులంటున్నారు. ఆయనను చూసి.. రాజకీయం ఇంత స్వార్థంగా మారిపోయిందేమిటా అని ఎక్కువ మంది ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ నాయకుల మీదే నమ్మకాన్ని జనం కోల్పోయే పరిస్థితిని ఇలాంటి నేతలు తీసుకు వస్తున్నారంటున్నారు.
టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసింది పవన్
మోసం చేసింది జగన్
కానీ ..జగన్ నే దైవసమానులంటున్న ఎమ్మెల్యే రాపాక !#Shameless pic.twitter.com/36C0DJyjgK
— Telugu360 (@Telugu360) May 20, 2023