ఎనర్జీ అంటే రవితేజదే. తెరపై రవితేజని చూస్తే చాలు హుషారు తన్నుకొచ్చేస్తుంటుంది. సెట్లో కూడా ఆయన అలానే ఉంటారు. దర్శకుడికీ అదే జోష్ ఉంటు సీన్ బై సీన్ చక చక తీసుకుపోవొచ్చు. అనిల్ రావిపూడిలో ఆ జోష్ ఉంది కాబట్టే… రాజా ది గ్రేట్ త్వరగా పూర్తయ్యింది. అయితే.. ఈ సినిమా అనుకొన్న సమయానికి రావడం వెనుక రవితేజ కమిట్మెంట్ చాలా ఉందనే చెప్పాలి. షూటింగ్లో భాగంగా రవితేజకు గాయమైనా… ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా ఈ సినిమా కోసం కష్టపడ్డాడట రవితేజ. ఈ విషయాన్ని కమెడియన్ శ్రీనివాసరెడ్డి స్వయంగా చెప్పుకొచ్చాడు.
రాజా ది గ్రేట్‌లో శ్రీనివాసరెడ్డి కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా సక్సెస్ మీట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రవితేజ ప్రమాదం గురించిన సంగతి మీడియా ముందుకు తీసుకొచ్చాడు శ్రీనివాసరెడ్డి. ”ట్రైన్ ఎపిసోడ్ తీస్తున్నప్పుడు రవితేజకు గాయాలయ్యాయి. ఓ వ్యాన్ ఆయన్ని గుద్దేసి ఈడ్చుకొంటూ తీసుకెళ్లింది. అనిల్ రావిపూడి పేకప్ చెప్పేద్దామనుకొన్నాడు. అయినా సరే.. ఆయన షూటింగ్‌కి అంతరాయం కలగకూడదన్న ఉద్దేశంతో షూటింగ్నికొనసాగించారు. అందుకే రవితేజ నిజంగా గ్రేట్” అని పొగడ్తలతో ముంచేశాడు. ఈ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే తనకో శుభవార్త కూడా తెలిసిందట. ”చాలా యేళ్ల తరవాత నేను మళ్లీ తండ్రి కాబోతున్నా. ఈ గుడ్ న్యూస్ నాకు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తెలిసింద”న్నాడు. ఎనీవే.. కంగ్రాట్స్ టూ శ్రీనివాసరెడ్డి.