రవితేజకు ఆ మధ్య వరుసగా పరాజయాలు వచ్చాయి. అయితే ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు మళ్ళీ ఫామ్ లోకి తీసుకొచ్చాయి. ధమాకాతో సోలోగా వందకోట్లు కలెక్ట్ చేసి.. మెగాస్టార్ తో కలసి చేసిన వీరయ్య మరో వందకోట్ల సినిమాగా నిలిచి.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాయి. ఈ మధ్య వచ్చిన రావణాసుర నిరాశపరిచినప్పటికీ రవితేజ డిమాండ్ ఏమీ తగ్గలేదు. దీనికి నిదర్శన తన కొత్త సినిమాకి రవితేజ తీసుకోబోయే పారితోషకమే.
కలర్ ఫోటో దర్శకుడు సందీప్ తో ఓ సినిమా చేయబోతున్నాడు రవితేజ. ఈ చిత్రానికి ఏకంగా పాతిక కోట్లు పారితోషకం తీసుకుంటున్నాడు. రవితేజ అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ బిగినింగ్ నుంచి తన పారితోషికం పెంచుకుంటూనే వచ్చాడు రవితేజ. వరుస పరాజయాలు వచ్చినపుడు కూడా తన పారితోషికం విషయంలో తగ్గలేదు. ఇప్పుడు కొత్త సినిమా విషయంలో అదే ఫాలో అయ్యారు. ఈ చిత్రంలో శర్వానంద్ కూడా నటించే అవకాశం వుంది. ఈ సినిమా కోసం సందీప్ గురుశిష్యుల కథని రెడీ చేశాడని తెలుస్తోంది.