కేంద్ర బడ్జెట్లో రాయలసీమకు మంచి ప్రాధాన్యం లభించింది. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ హబ్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. కడప, కర్నూలు జిల్లాల్లో భారీగా పరిశ్రమలు ఏర్పాటు కావడానికి ఇది సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో కొప్పర్తి పారిశ్రామిక వాడ భాగం. గతంలో కొప్పర్తిలో ఎన్నో పరిశ్రమలు తెచ్చేందుకు అవకాశమున్నా… వినియోగించుకోలేకపోయారు. టీడీపీ హయాంలో వచ్చిన డిక్సన్ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించింది. గార్మెంట్, టీవీల తయారీ పరిశ్రమల నిర్మాణం చివరి దశలో ఉంది. కొప్పర్తిలో పరిశ్రమలకు కీలకమైన నీటి సౌకర్యం కల్పిచలేకపోయారు. కొప్పర్తి పారిశ్రామికవాడలో సౌత్జోన్లో 2,595 ఎకరాలను వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా అబివృద్ధి చేయనున్నారు. ఈ కారిడార్‌లో అవసరమైన రోడ్లు, నీరు, విద్యుత్, పరిశ్రమల వ్యర్థాల కోసం ప్రత్యేక ప్లాంటు, ఇతర వసతులు వకేంద్ర నిధఉలతో కల్పిస్తారు.
Also Read :ఆంధ్రప్రదేశ్‌కి ది బెస్ట్ బడ్జెట్
ఇక ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు బడ్జెట్ ఊపిరి పోసింది. హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా ఓర్వకల్లు హబ్‌లో నీరు, విద్యుత్తు, రైల్వే, రోడ్లు వంటి మౌలిక వసతులకు నిధులు ప్రకటించారు. కర్నూలు నగరానికి 20 కిలో మీటర్ల దూరంలో ఓర్వకల్లు ఉంది. అక్కడ విమానాశ్రయం కూడా అందుబాటులో కి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు 33 వేల ఎకరాల్లో ఓర్వకల్లు హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆసియాలోనే అతి పెద్ద సోలార్ పార్క్ ఏర్పాటు చేశారు. ఓర్వకల్లును పారిశ్రామిక పార్క్ చేసేందుకు అనేక ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నా వైసీపీ ప్రభుత్వం పక్కన పడేయడంతో ఐదేళ్లుగా ముందుకు కదల్లేదు. కేంద్ర బడ్జెట్లో ఓర్వకల్లు హబ్‌లో మౌలిక వసతులకు నిధులిస్తామని ప్రకటించడంతో మళ్లీ పారిశ్రామిక సంస్థలు ఓర్వకల్లు వైపు చూసే అవకాశాలు ఉన్నాయి.
తిరుపతిలో ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నారు. బెంగళూరుకు దగ్గరగా ఉన్న అనంతపురానికి వచ్చే రెండేళ్లలో ఆటోమోబైల్ పరిశ్రమలు వెల్లువెత్తనున్నాయి. విశాఖను సాఫ్ట్ వేర్ కంపెనీల కేంద్రంగా చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వ .. రాయలసీమను తయారీ హబ్ గా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే శ్రీ సిటీలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పుడు రాయలసీమ వ్యాప్తంగా ఈ పరిశ్రమల్ని విస్తరించి.. ఉపాధి అవకాశాలు పెంచనున్నారు.