ఆంధ్రప్రదేశ్‌లో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరుగుతోంది. ఐదు చోట్ల కూడా.. రీపోలింగ్ జరగడానికి ఉద్రిక్త పరిస్థితులు కారణం కానే కాదు. ఈవీఎంల సాంకేతిక సమస్యలు, ఆర్వోల అవగాహన లేమి.. ఇతర కారణాల వల్ల రీపోలింగ్ అవసరం అయింది. ఈ ఐదు చోట్లలోనూ.. రెండు చోట్ల.. కేవలం పార్లమెంట్ నియోజకర్గాలకు మాత్రమే పోలింగ్ జరుగుతోంది. సాంకేతిక సమస్యలతో… వచ్చిన రీపోలింగ్‌కు.. ఈసీ తనదైన శైలిలో ఏర్పాట్లు చేసింది. భద్రత విషయంలో అతి చూపించింది. ఫలితంగా..ఆ భద్రతను చూసి.. ఓటర్లు.. ఆ పోలింగ్ కేంద్రం వైపు రావడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువు పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ పెట్టారు. నిజానికి అక్కడ ఏప్రిల్ పదకొండో తేదీన పోలింగ్ ఏమీ ఆగిపోలేదు. కానీ వివిధ రకాల కారణాలు చూపి రీపోలింగ్ ఏర్పాటు చేశారు. ఒక్క పోలింగ్ బూత్ కోసం.. కనీసం రెండు వందల మంది పోలీసుల్ని మోహరించారు. అంతేనా… పోలింగ్ కేంద్రం సమీపంలో… పర్చూరుకుపోయే రహదారి ఉంటే.. దాన్ని కూడా మూసి వేశారు. ఇక.. పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల ఎవరైనా కనిపిస్తే లాఠీ చార్జీ ఖాయమన్నట్లుగా… పోలీసులు హడావుడి చేశారు. దాంతో.. ఎందుకొచ్చిన తంటా అని..ఆ పోలింగ్ పరిధిలో ఉన్న ఓటర్లు… బయటకు రావడానికి సందేహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రీపోలింగ్ జరిగే ఐదు కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తిస్తామని ముందుగానే.. ఎన్నికల సంఘం ప్రధానాధికారి.. ద్వివేదీ ప్రకటించడంతో… దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు. గుంటూరు పశ్చిమ కాకుండా.. మిగతా నాలుగు నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి ఉంది. సాధారణ ఎన్నికలు జరిగేటప్పుడు..ఈ బూత్‌లకు.. ఒక్కొక్క కానిస్టేబుల్‌ను మాత్రమే.. రక్షణగా ఏర్పాటు చేశారు. రీపోలింగ్ కి వచ్చే సరికి.. ఇంత మంది ఎందుకన్న ప్రశ్న.. సహజంగానే ఓటర్లలో వస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం… ఈసీకి మాత్రమే తెలుసు. కానీ వారు చెప్పరు.