మహానగరం విస్తరిస్తూంటే.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అందులో కలిసిపోతూంటాయి. హైదరాబాద్ విస్తరణతో … సంగారెడ్డి కూడా కూడా మహానగరంలో భాగంగా మారుతోంది. మొత్తం సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ది చెందడానికి హైదరాబాద్ కారణం అవుతోంది. కొన్ని వేల మంది కార్మికులు రోజూ హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తూంటారు. అయితే ఇప్పుడు ఆ పారిశ్రామిక విప్లవం కారణంగా రియల్ ఎస్టేట్ కూడ పుంజుకుంటోంది. అక్కడే నివాసయోగ్యమైన కాలనీలు పెరిగిపోతున్నాయి.
ఒకప్పుడు హైదరాబాద్లో ఓల్డ్ ముంబై హైవే అంటే… చందానగర్ శివారు అనుకునేవారు. కానీ ఇప్పుడు సంగారెడ్డి అనుకునే పరిస్థితి వచ్చింది. చందానగర్..రామచంద్రాపురం, పటాన్ చెరు, ఇస్నాపూర్, కంది, సంగారెడ్డి ఇలా…రియల్ ఎస్టేట్ వ్యాప్తి చెందింది. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వరకూ రియల్ ఎస్టేట్ వెంచర్లు భారీగా ఉన్నాయి. పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేసిన ఔత్సాహికులు ఇప్పుడిప్పుడే ఇళ్లు కట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. భవిష్యత్ లో సంగారెడ్డి వరకూ మెట్రో వస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
Also Read : హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !
పారిశ్రామికంగా సంగారెడ్డి జిల్లా మంచి అభివృద్ధి సాధిస్తోంది. నిజానికి ముందు నుంచీ పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతమే. కానీ కాలుష్యం అన్న పేరు ఉంది. ఇటీవలి కాలంలో కాలుష్యం లేకుండా పరిశ్రమలు జాగ్రత్త పడుతున్నాయి. గతంలో ఫ్యాక్టరీలపై పొగగొట్టాలుండేవి. ఇప్పుడు అలాంటివి లేవు. భారీ పరిశ్రమలు.. చాలా వరకూ కాలుష్యాన్ని నిర్వీర్యం చేసుకునే చర్యలు తీసుకున్నాయి. ఈ కారణంగా హౌసింగ్ ప్రాజెక్టులకూ డిమాండ్ పెరుగుతోంది.
ఇప్పటికే బీహెచ్ఈఎల్ నుంచి సంగారెడ్డి వరకూ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడంతో త ధరలు కూడా స్థిరంగా పెరుగుతున్నాయి. ఇస్నాపూర్లో ఇప్పిడిప్పుడే కాలనీలు పెరుగుతున్నాయి. అక్కడ రూ. కోటి వరకూ పెట్టుకుంటే విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. సంగారెడ్డి వరకూ ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు సిటీకి కాస్త దూరంగా అనిపించినా భవిష్యత్లో అలాంటి చోట్ల కొనుగోలు చేయడం… కష్టమవుతుంది. ఇప్పుడు కొనుక్కున్నవారే అదృష్టవంతులన్నట్లుగా సీన్ మారిపోతుంది.