హైదరాబాద్లో బడా కంపెనీలు తమ తమ కొత్త ప్రాజెక్టుల్ని అనౌన్స్ చేస్తున్నాయి. అయితే గతంలో ప్రారంభమైన 25 హౌసింగ్ ప్రాజెక్టుల పనులు మధ్యలోనే నిలిచిపోయాయానని డేటా అనలిటిక్ కంపెనీ ప్రాప్ ఈక్విటీ ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఎన్ని ప్రాజెక్టులు నిలిచిపోయాయో ఈ సంస్థ వెల్లడించింది. 42 సిటీల్లో మొత్తం 1981 హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణ పనులు ఆగిపోయాయని అందులో పాతిక హైదరాబాద్లోనివని తెలిపింది.
మిగతా సిటీలతో పోలిస్తే.. ఇలా నిర్మాణాలు ఆగిపోయిన ప్రాజెక్టుల సంఖ్య తక్కువే. అయితే ఇలా ఆగిపోవడానికి కారణం డిమాండ్ లేక కాదు. డిమాండ్ ఉంది. కస్టమర్లు డబ్బులు చెల్లించడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆ కంపెనీలు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే ఆ ప్రాజెక్టులు ఆగిపోయాయి. హౌసింగ్ ప్రాజెక్టుల అమలు సామర్థ్యాలు డెవలపర్లకు లేకపోవడమే ప్రాజెక్టులు ఆగిపోవడానికి ప్రధాన కారణంగా ప్రాప్ ఈక్విటీ తెలిపింది. నమ్మకంతో బుకింగ్ చేసుకున్న కొనుగోలుదారుల డబ్బుని లోన్లు చెల్లించేందుకు వాడడం, కొత్త భూముల కోసం వినియోగించడం వంటివి చేయడం వల్ల ఆయా కంపెనీల వద్ద నగదు కొరత ఏర్పడింది. పనులు చేయించడానికి నిధఉలు లేకుండా పోయాయి. ఫలితంగా ఆ ప్రాజెక్టులు ఆగిపోయాయి. కానీ జరిగే ప్రచారం మాత్రం వేరుగా ఉంటుంది
హైదరాబాద్లో ఇలా ఆగిపోయిన ప్రాజెక్టులు 25 మాత్రమే కానీ. .. ముంబైలో 234 , బెంగళూరులో 225 , పుణెలో 172 ప్రాజెక్టులు, గురుగ్రామ్ లో 158 ఆగిపోయాయి. అంటే అక్కడ డిమాండ్ పడిపోయిందన్న అర్థం కాదుగా. ఇలాంటి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టిన వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేలా చేసేందుకు కొత్త రుణసౌకర్యం లేదా మరో వెసులుబాటు కల్పించే చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. అందుకే త్వరలో ఈ ప్రాజెక్టులూ పట్టాలెక్కే అవకాశం ఉంది.