మలయాళ చిత్రం `నాయట్టు`ని రీమేక్ చేయాలనుకుంది గీతా ఆర్ట్స్. ఆ బాధ్యతని… పలాస దర్శకుడు కరుణ కుమార్ కి అప్పగించింది. రావురమేష్, అంజలిలను కీలక పాత్రలకుగానూ ఎంచుకుంది. అంతా రెడీ అనుకున్న దశలో ఈ సినిమా ఆగిపోయింది. దానికి కారణం.. బడ్జెట్ సమస్యలే అని టాక్. ఈ సినిమాని రూ.4 కోట్లలో తీసి పెట్టమని కరుణకి చెబితే.. బడ్జెట్ లెక్కలేసుకున్నప్పుడు రూ.8 కోట్లు తేలాయట. దర్శకుడిగా కరుణ రూ.1.25 కోట్ల ప్యాకేజీ అడిగాడని, రావు రమేష్ కే రూ.కోటి పారితోషికం ఇవ్వాల్సివచ్చిందని టాక్. రూ.8 కోట్లతో సినిమా తీస్తే… వర్కవుట్ అవుతుందా, లేదా? అనే డైలామాతో ఈ సినిమాని ఆపేశారు. ఇప్పుడు `నాయట్టు` డబ్బింగ్ రైట్స్ కూడా గీతా ఆర్ట్స్ దగ్గరే ఉండడంతో.. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి, ఆహాలో వదిలేద్దాం అని ఫిక్సయ్యారు. అయితే కరుణకి అడ్వాన్స్ ఇచ్చిన దృష్ట్యా…. తనతో మరో సినిమా ప్లాన్ చేస్తోంది గీతా ఆర్ట్స్. వాటికి సంబంధించిన వివరాలు త్వరలో తెలుస్తాయి.