పవన్ కల్యాణ్ వరద బాధిత పర్యటించలేదని వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ పవన్ కల్యాణ్.. అలాంటి వాటిని పట్టించుకోనని స్పష్టం చేశారు. ఇప్పుడు తాను వరద ప్రాంతాల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. అదే విషయం చెప్పారు. తన కోసం దూసుకు వచ్చేవారితో… ఫ్యాన్స్ తో మొత్తం గందరగోళం అయిపోతుంది. అందుకే పవన్ కల్యాణ్ వ్యహాత్మకంగా పరోక్ష సహాయ కార్యక్రమాలకే పరిమితమయ్యారు.
ఇదే విషయంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకూ ఆయన సూటిగానే సమాధానం ఇచ్చారు. అనేవాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు కానీ.. మనకంటూ విచక్షణ ఉంటుంది కదా ఆని ఆయన భావన. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కానీ ఆయన ఇమేజ్ వేరు. ఆయన ఒక్క సారి విజయవాడలోకి ఎంటర్ అయితే… అదుపు చేయలేని పరిస్థితి వస్తుంది. జగన్ లాగా పది మందిని పిలిపించుకుని నినాదాలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ వచ్చారని తెలిస్తే వేల మంది వచ్చేస్తారు. అది జరుగుతున్న సహాయ కార్యక్రమాలను ఆటంకపరుస్తుది. దీనిపై స్పష్టత ఉండటం వల్లనే పవన్ ఫీల్డ్ లోకి దిగలేదని ఆయన మాటల ద్వారా స్పష్టమయింది.
వైసీపీ నేతలు ఫీల్డ్ లోకి వెళ్లి పని చేస్తున్న వారిని పబ్లిసిటి కోసమని.. వెళ్లని వారిని వెళ్లలేదని విమర్శించడానికి రెడీగా ఉంటారు. కానీ ఆ పార్టీ నేతలెవరూ ఫీల్డ్ లో కనిపించడం లేదు. జగన్ ఒక్క పది నిమిషాలు షో చేసి ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు. కానీ.. నిరంతరం కష్టపడుతోంది మాత్రం ప్రజాప్రతినిధులే. పవన్ ఆఫీసు నుంచి పర్యవేక్షణ చేయడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేలు. అంతా సద్దుమణిగిన తర్వాత ఆయన బాధితుల్ని పరామర్శించే అవకాశం ఉంది.