కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌పై ప్రేమ ఒలకబోస్తున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీగా కాంగ్రెస్ పై తనకు ఎనలేని అభిమానం ఉందంటున్నారు. పార్టీ బాగు కోసమే… విమర్శలు చేశానని చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తనపై చర్యలు తీసుకోదని.. కూడా… ధీమాతో ఉన్నారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన తర్వాత ఆ పార్టీ తలుపులు మూసేయడంతో.. రాజగోపాల్ రెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయింది. ఇప్పుడు.. సొంత పార్టీని కాకాపట్టే ప్రయత్నంలో ఉన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రేంజ్.. పీసీసీ స్థాయి అని ఊహించేసుకుని.. భారతీయ జనతా పార్టీలో చేరగానే తనకు.. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి ఇస్తారని ఊహించేసుకున్న ఆయన.. రెంటికి రెడ్డ రేవడి అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన డిమాండ్లు విని.. బీజేపీ నేతలు… కూడా.. లైట్ తీసుకోవడంతో.. ఇప్పుడు.. ఢిల్లీలో ఆయనను పలకరించే బీజేపీ నేత లేరు. అలాగే … కాంగ్రెస్ నుంచి ఆయనను బయటకు పంపే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. రాజగోపాల్ రెడ్డి తీరు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని చెబుతున్నారు. రేపు పార్టీలో చేరినా.. ఇదే రచ్చ చేసి పరువు తీస్తాడని.. చేర్చుకోకపోవడమే మంచిదని… వారు హైకమాండ్‌కు చెప్పడంతో.. వారు కూడా సరేనన్నారు. దాంతో ఇప్పుడు.. బీజేపీలో తలుపులు మూసుకుపోయాయి.
పదవులపై ఎలాంటి హమీలు లేకుండా…. ఎలాంటి షరుతులు లేకుండా.., బీజేపీలో చేరితే చేరండి.. లేకపోతే లేదనే పరిస్థితిని ఇప్పుడు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఆయన పది రోజులుగా ఢిల్లీలో ఉన్న.. ఒకటి, రెండు సార్లు మాత్రమే… బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపారు. కానీ.. ఇతర నేతలు ఆసక్తిచూపలేదు. వారు పిలుస్తారని.. రాజగోపాల్ రెడ్డి ఆశగా ఉన్నారు. అదే సమయంలో.. ఆయన ఎమ్మెల్యే పదవికీ గండం పొంచి ఉంది. ఈ పరిస్థితుల్లో.. ఇప్పటికి మెల్లగా కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉండటమే మంచిదని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం.. కోమటిరెడ్డితో తనపై చర్యలు తీసుకోకుండా లాబీయింగ్ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది.