వైసీపీ నేతలు పలు స్కాముల్లో, దాడుల్లో అడ్డంగా ఇరుక్కుని జైలుకెళ్లే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని టీడీపీ కార్యకర్తలు గింజుకుంటున్నారు. కానీ టీడీపీ వ్యూహకర్తలు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ముందుగా వైసీపీ నేతలకు బయటపడకుండా న్యాయపరమైన అవకాశాలన్నింటినీ క్లోజ్ చేసి ఆ తర్వాత అరెస్టుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
Read Also : వైసీపీకీ పులకేశీనే !
టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు చంద్రబాబు ఇల్లు, గన్నవరం టీడీపీ ఆఫీసుదాడి ఘటనల్లో పోలీసులు అదే వ్యూహం పాటిస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లిన వారు ఇప్పటికీ వాదనలు వినిపిస్తున్నారు. వారిని అరెస్టు చేయాల్సిందేనని ప్రభుత్వ లాయర్లు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ ను కోర్టులు నిరాకరిస్తే.. వారికి న్యాయపరమైన అవకాశాలన్నీ క్లోజ్ అయిపోయినట్లే. అంతే కాదు వెంటనే అరెస్టు చేయవచ్చు.. బెయిల్ కూడా అంత త్వరగా లేదు.
వైసీపీ నేతలు చేసిన ఘోరాలపై సాధారణ కార్యకర్తలకు ఎంత ఉంటుందో… పార్టీ ముఖ్యనాయకులకు అంత కంటే ఎక్కువ కోపం ఉంటుంది. ఘోరాలకు పాల్పడిన వారిని పాపం అని వదిలేసేంత పరిస్థితి కూడా ఉండదు. అయితే సామాన్య కార్యకర్తలు ఆవేశపడతారు.. నాయకులు మాత్రం ఆలోచనతో వ్యవహరిస్తారు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది.