ఫిబ్రవరి పధ్నాలుగో తేదీన ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఉద్రిక్తత ఉంటుందని.. కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. ఆ రోజు.. విజయవాడలో… కేసీఆర్, జగన్ ఫెడరల్ ఫ్రంట్ చర్చలు జరుపుతారని… షెడ్యూల్ బయటకు రావడమే కారణం. ఫిబ్రవరి పధ్నాలుగో తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఉంటుందని.. దానికి కేసీఆర్ హాజరవుతారని చెప్పుకున్నారు. కానీ.. గృహప్రవేశ కార్యక్రమం రద్దయింది. జగన్ హైదరాబాద్లోనే ఉండిపోయారు. అదే సమయంలో.. కేసీఆర్… జగన్ గృహప్రవేశ కార్యక్రమంతో పాటు విశాఖ శారదాపీఠంలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. జగన్ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది కాబట్టి.. ఆ కార్యక్రమానికైనా కేసీఆర్ వెళ్తారేమో అనుకున్నారు. ఎందుకంటే.. శారదా పీఠాధిపతి స్వరూపానంద .. కేసీఆర్ కోసం.. రెండు సార్లు యాగాలు చేసి ఉన్నారు. అందుకే వెళ్తారని అనుకున్నారు. కానీ ఈ పర్యటనను కేసీఆర్ రద్దు చేసుకున్నారు.
గృహప్రవేశాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాయిదా వేసుకున్నారన్నదానిపై క్లారిటీ లేదు. నిజానికి.. లాంఛనంగా.. మాత్రమే… గృహప్రవేశ కార్యక్రమం పెట్టుకున్నారు. ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయిలో ఆ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నారు. కానీ ఎన్నికలకు ముందే.. ఏపీకి వచ్చేశామని చెప్పుకునేందుకు ఆ కార్యక్రమం పెట్టుకున్నారు. దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. కుటుంబ పరమైన కారణాలని.. వైసీపీ నేతలు చెబుతున్నప్పటికీ.. అలాంటి కారణాలేమీ .. కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో రోజూ.. పార్టీలో చేరేందుకు వచ్చే వారితో..సమావేశమవుతూనే ఉన్నారు. కేసీఆర్ రావడం లేదన్న కారణంగానే… వాయిదా వేసుకున్నారని … కేసీఆర్ టూర్ కన్ఫర్మ్ అయితే.. కొత్త తేదీ ప్రకటిస్తారని అంటున్నారు. కేసీఆర్తో కలిసి పని చేసే విషయంలో జగన్ చాలా ఉత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు.
అయితే.. కేసీఆర్.. జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశాన్నే కాదు.. విశాఖ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. ఇదే అందరిలోనూ ఆశ్చర్యం రేకెత్తించింది. దేన్ని అయినా కేసీఆర్ వాయిదా వేస్తారు కానీ.. యజ్ఞయాగాదుల విషయంలో.. ఆయన నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటారని చెబుతున్నారు. అలాంటిది… కేసీఆర్ .. విశాఖకు వెళ్లకపోవడానికి కారణం ఏమిటన్నదానిపై చర్చ జరుగుతోంది. నిజానికి ఈ రోజు.. చంద్రబాబు పర్యటన కూడా విశాఖలో ఉంది. విశాఖలో కొత్తగా నిర్మించిన మిలీనియం ఐటీ టవర్ని ప్రారంభించడం.. .. అదానీ గ్రూప్ ని పై డేటా సెంటర్కి శంకుస్థాపన కార్యక్రమం.. అలాగే..బోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన వంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ఇద్దరు ముఖ్యమంత్రులూ విశాఖలోనే ఉంటారు. ఇలాంటి పరిస్థితి వద్దనే…కేసీఆర్.. యాగానికి దూరంగా ఉన్నారని చెబుతున్నారు.