గవర్నర్ తమిళిశై వ్యవహారంపై కేసీఆర్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆమెను గవర్నర్‌గా గుర్తించడానికి కూడా సిద్ధపడటం లేదు. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేసేశారు. దీనిపై తమిళిశై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీడియాకు తెలిసేలా చేశారు. అచ్చంగా ప్రభుత్వ వర్గాలు కూడా గవర్నర్‌పై సీఎం కేసీఆర్ కు ఎందుకు అసంతృప్తో కారణాలు వెల్లడిస్తూ మీడియాకు సమాచారం ఇచ్చాయి. దీని ప్రకారం .. గవర్నర్ తమిళిశై.. ప్రభుత్వం ఇచ్చినస్పీచ్లను కాకుండా సొంత స్పీచ్‌లను చదువుతున్నారు.
గత ఏడాది బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించారు. ఆ సమయంలో రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించని కొన్ని పేరాలను గవర్నర్ సొంతంగా చదివారు. అక్కడ ప్రారంభమైన గ్యాప్ అంతకంతకూ పెరిగింది. జనవరిలో గణతంత్ర వేడుకల సందర్బంగా జెండా ఎగురవేసిన తర్వాత.. ప్రభుత్వం ఆమోదించిన ప్రసంగాన్నే చదవాలి. . కానీ ఆమె సొంత ప్రసంగాన్ని చదివారు. ప్రసంగం వద్దని ప్రభుత్వం చెప్పింది.కానీ ఆమె చదివారు. ఈ రెండు విషయాల్లోనే కాదు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా సిఫారసు చేయడం.. ఎంఐఎం ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్‌గా చేసే విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయాలను తమిళిశై తిప్పి పంపారు.
కేంద్ర ప్రభుత్వాలకు తోలుబొమ్మగా గవర్నర్ మారారని ప్రభుత్వం భావిస్తోంది. తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై.. గవర్నర్‌గా తెలంగాణకు వచ్చినప్పటికీ పాత వాసనలు వదులుకోలేదని పేర్కొన్నాయి. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తున్నాయి. ఇప్పటికీ గవర్నర్‌కు పరిస్థితులు చేయి దాటిపోలేదని, తీరు మార్చుకుంటే మంచిదని ప్రభుత్వవర్గాలు హితవు పలికాయి. మొత్తంగా చూస్తే గవర్నర్ వర్సెస్ సీఎం కోల్డ్ వార్ అనుకున్నదాని కంటే ఎక్కువగానే ఉందని భావిస్తున్నారు.