ఏపీ, తెలంగాణల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. గత ముఫ్ప నలభై ఏళ్లలో ఎప్పుడూ ఒకే సారి కురవనంత వర్షం ఇప్పుడు పడుతోంది. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షం వల్ల వాగులు, వంగలు పొంగి పొర్లుతున్నాయి. అయితే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండటం వల్ల.. ప్రాణనష్టాన్ని పరిమితం చేయగలిగారు. తొలి రోజు విజయవాడలో కొండరాళ్ల జారిపడటం… గుంటూరులో ఓ కారు కొట్టుకుపోవడం మరణాలు జరిగాయి. తర్వాత ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తం కావడం అధికార యంత్రాంగం అంతా పూర్త స్థాయిలో రంగంలోకి దిగడంతో ప్రాణనష్టం తప్పింది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ అధికారులతో ఆన్ లైన్ లో నే ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుంటూ ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజల కోసం ఏపీలో వందకుపైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వర్షాలు పెరుగుతాయా.. తగ్గుతాయా అన్న విషయాలు తెలుసుకుని ఎక్కడిక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు చేస్తున్నారు.
గంటూరు నుంచి ఖమ్మం వరకూ వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఊళ్లన్నీ నీట మునిగాయి. అయితే పల్లెల్లో చెరువులు నిండికొన్ని చోట్ల పొంగడం వల్ల సమస్యలు వచ్చాయి. మిగిలిన చోట్ల సమస్యల్లేవు. విజయవాడలో సింగ్ నగర్ వటి చోట్ల ముంపు వచ్చింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నరాు. సోమవారం కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వర్షాలు తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.