శేషాచలం అడవల్లో ఎర్రచందనం దుంగలు కొట్టి స్మగ్లింగ్ చేయాలంటే.. ఎక్కడో డీప్ ఫారెస్టులోకి స్మగ్లర్ల ముఠాలు వెళ్లేవి. కానీ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందారు. నేరుగా తిరుమల ఘాట్ రోడ్ లోనే ఆ పని పూర్తి చేస్తున్నారు. పొరపాటున ఎవరికైనా తెలియక.. పోలీసులు పట్టుకుంటే… చూసీ చూడనట్లుగా వదిలేయాల్సి ఉంటుంది. పొరపాటున తెలియని వారు పట్టుకున్నప్పుడు.. అదేమీ పెద్ద విషయం కాదన్నట్లుగా వదిలేయాలి. అదే జరుగుతోంది.
నిన్న తిరుమల ఘాట్ రోడ్ నుంచి వస్తున్న వాహనంలో ఎర్ర చందనం దుంగలు ఉన్నాయి. పోలీసులు పట్టుకున్నారు. అలా ఎన్నో సార్లు తీసుకెళ్లాం.. అది మా రాచబాట ఎవరు ఆపుతారనుకున్నారో కానీ.. .. ఆ స్మగ్లర్కు ఇబ్బంది ఎదురైంది. ఈ ప్రోటోకాల్ తెలియని పోలీస్ ఎవరో ఆపారు. దుంగలు బయటపడ్డాయి. మీడియాకు తెలిసింది. దాంతో తప్పనిసరిగా స్టేషన్ కు తరలించారు. కానీ ఇరవై నాలుగు గంటల పాటుకేసుపెట్టలేదు. దుంగల వాహనాన్ని కూడా మాయం చేశారు. గగ్గోలు రేగే సరికి.. కేసు పెట్టారు.
అసలు తిరుమల ఘాట్ రోడ్ లో ఎర్ర చందనం దుంగల స్మగ్లింగ్ అంటే.. ఎంత పెద్ద ముఠా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయినా అదేదో చిన్న విషయం అన్నట్లుగా వదిలేశారు. పోలీసులు కూడా అంతే ఉన్నారు. దొంగల జోలికి వెళ్తే తమకు సమస్యలు ఎదురవుతాయని భయపడుతున్నారు. రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారో… మేరా ఏపీ మహాన్.