ప్రభుత్వం ఎక్కడైనా జాబ్ ఫెయిల్స్ పెడుతుందా ? విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు మూడు ప్రాంతాల్లో మూడు జాబ్ ఫెయిర్స్ ప్రైవేటుగా.. తన ట్రస్ట్ కిద పెట్టారు. మరి ప్రభుత్వం జాబ్ ఫెయిర్స్ ఎప్పుడు పెట్టిందో ఎవరికీ తెలియదు. కానీ ఈ జాబ్ ఫెయిర్స్ కోసం అంటూ ఓ సలహాదారుడిని నియమించేశారు. ఆయన పేరు గాడి శ్రీధర్ రెడ్డి. ఇక్కడ సామాజిక పాటించారన్నమాట. ఇటీవల వారానికో సలహాదారుడ్ని నియమిస్తున్నారు. గతంలోనే నియమించినా కొత్తగా జీవోలు బయట పెడుతున్నారు.
ఈ గాడి శ్రీధర్ రెడ్డికి సలహాదారు పదవి… విజయసాయిరెడ్డి కోటా. విశాఖపట్నంలో వైసీపీ ఐటీ వింగ్‌ను చూసుకుంటూ ఉంటారు. ఈయన తనకు సలహాదారు పదవి ఇచ్చారని.. యువతకు స్కిల్ డెవలప్మెంట్ – ఉద్యోగ కల్పనలో చిత్తశుద్ధితో పనిచేస్తూ మీ మన్నననలు పొందుతానని పెద్ద పెద్ద ప్రకటనలు సోషల్ మీడియాలో ఇచ్చేసుకున్నారు. ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారేమో కానీ పార్టీలో ఓ స్థాయి లో పని చేసిన వారందరికీ సలహాదారు పదవులు ఇచ్చేస్తున్నారు. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లుగా పార్టీ నేతలకు నెలవారీగా పంచేస్తున్నారు.
సలహాదారుల విషయంలో కోర్టు తప్పు పట్టింది. తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వం డోంట్ కేర్ అంటోంది. ప్రజా ధనాన్ని సొంతానికి వాడుకోవడం.. సాక్షికి ప్రకటనల రూపంలో కొంత… సాక్షి ఉద్యోగులకు ఔట్ సోర్సింగ్ రూపంలో కొంత ఇస్తూ.. వందల కోట్లను జమ చేయడం కామన్ అయిపోయింది. ప్రజలు ఓట్లేసి గెలిపించడం అంటే.. తాము కట్టే పన్నుల సొమ్మును సొంతానికి వాడుకోమని రాసిచ్చినట్లుగా ప్రభుత్వం తీరు ఉందనే విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి.