కులం చూడం.. మతం చూడం అనేది జగన్ డైలాగ్. కానీ రైతుల్లోనే కులం చూసిన చరిత్ర ఆయనది. అయితే రాజకీయంగానూ ఆయనరెడ్లకే ప్రాధాన్యం ఇస్తారని వారందరూ బాగుపడిపోయారని … అనుకుంటూ ఉంటారు. నిజానికి జగన్ పరిపాలనలో పిడికెడు మంది రెడ్లకు పదవులు వచ్చాయి. మిగతా వారంతా చితికిపోయారు. రెడ్లు అయినా సరే తమ కు అన్యాయం జరిగిందని నోరెత్తితే వాళ్ల బతుకుల మీద దెబ్బకొట్టడమే వైసీపీ నేతల పని. పై స్థాయిలో ఉండే వ్యక్తి మనస్థత్వం అదే కావడంతో కింది స్థాయి వారు ఇలాంటి పనుల్ని విచ్చలవిడిగా చేసేశారు. ఫలితంగా ఆ వర్గం వంచనకు గురయింది.
చిత్తూరు జిల్లాలో ఓ రెడ్డి సామాజికవర్గ జడ్పీటీసీ… పార్టీ నాయకుడితో విబేధిస్తే ఆయనపై పాతకేసులు బయటకు తీసి అరెస్ట్ చేసి.. ముఖాన ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశ పెట్టి పెద్ద అంతర్జాతీయ దొంగనుపట్టుకున్నట్లుగా ముద్ర వేశారు. వైసీపీ పెద్దల కాఠిన్యం ఎంత దారుణంగా ఉంటే… కులం కూడాచూడరని అప్పుడే చాలా మందికి క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత రెడ్డి సామాజికవర్గంపై జరిగిన దారుణాలకు లెక్కే లేదు. రాయలసీమలో రాజకీయ హత్యలకు గురైన వారిలో అత్యధికులు వారే. ఆస్తులు కోల్పోయింది వారే. వైసీపీ తిడితే తిట్టించుకుని.. కొడితే కొట్టించుకున్న వారే బతకాలి.. ఇంకెవరూ బతకూడదన్నట్లుగా పాలన సాగింది.
ఓ సామాజికవర్గాన్ని దివాలా తీయించాలన్న లక్ష్యంతో జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఇబ్బంది పడ్డారు. పూర్తి స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు కోల్పోయారు. అలాంటి వారిలో రెడ్డిసామాజికవర్గం వారు ఎక్కువగా ఉన్నారు. సంప్రదాయంగా వారు చేసే వ్యాపార వ్యవహారాలు ఏపీలో పడకేయడంతో నాలుగేళ్లుగా ఆదాయాన్ని కోల్పోయారు. నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోవడంతో… ఉపాధి కోసం రాష్ట్రం దాటిన రెడ్లు ఎంతో మంది. పోనీ పార్టీని నమ్ముకున్న రెడ్లను అయినా బాగు పరిచారా అంటే.. మన ప్లేట్లో మన బిర్యానీ అని కథలు చెప్పి.. ప్రభుత్వం రాగానే పనులు చేయించి.. బిల్లులు ఇవ్వమని అడిగితే వేధింపులకు గురి చేస్తున్నారు.
నారా లోకేష్ సీమ పర్యటనలో… కొన్ని వందల మంది రెడ్లు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇవన్నీ ప్రభుత్వ నిర్వాకాల వల్ల వచ్చినవే. రెడ్డివర్గాన్ని ఉద్దరించేస్తున్నారని చెప్పుకునేవారికి వారి బాధలు పట్టవేమో కానీ.. నిజంగా కూర్చున్న కొమ్మను నరుక్కున్నామనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. కడపు కొట్టాడని తెలిసినా కులం పేరుతో ఓట్లు వేస్తారని ఆశపడేవారికి వచ్చే ఎన్నికలు గుణపాఠం చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది.