తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మార్మోగుతున్న పేరు రేవంత్ రెడ్డి. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్నికులాలు, మతాలు ఓటు వేస్తేనే కాంంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వం వహించారు. ఓపెన్ గానే ఆయన గతంలో రెడ్ల నాయకత్వ సామర్థ్యం గురించి చెప్పారు. రెడ్లు అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. అందరికీ మంచి చేసే నాయకత్వ లక్షణాలు ఉన్నాయన్నారు. మిగతా వారి సంగతేమో కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సీఎంలుగా ఉన్న ఇద్దరు రెడ్డి నేతల మధ్య సహజంగానే పోలికలు వస్తున్నాయి. ఎవరు రెడ్డి ఐకాన్ అవుతారనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరు రెడ్డి ఐకాన్ .
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రేవంత్ రెడ్డి సీఎం – తండ్రి మృతిని వాడేసుకుని జగన్ రెడ్డి రాజకీయం !
ఇద్దరు ముఖ్యమంత్రుల రాజకీయ పయనాన్ని చూస్తే… రేవంత్ రెడ్డిది స్ఫూర్తిదాయక పయనం. మధ్యతరగతి కుటుబంంలో జన్మించినా .. ఆయన నాయకత్వ లక్షణాలతోనే ఎదిగారు. ఇండిపెండెంట్ జడ్పీటీసీగా గెలిచి రాజకీయం ప్రారంభించారు. పదిహేడు ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రి పదవిని అందుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన ఎప్పుడూ అధికార పార్టీలో లేరు. ఎమ్మెల్యేగా ఉన్నా.. ఎంపీగా ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నారు. కానీ ఎవరికీ లొంగిన దాఖలాల్లేవు. ఎవరికీ భయపడిన దాఖలాల్లేవు. పోరాటమే స్ఫూర్తిగా ఎదిగారు. అనుకున్నది సాధించారు. మరి జగన్ రెడ్డి ఏం చేశారు ? . ఎంపీ పదవి కోసం సొంత కుటుంబసభ్యులపై దాడి చేసిన చరిత్ర. తండ్రి చనిపోతే .. ముక్కలుగా శవం పక్కన ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించిన చరిత్ర ఉంది. ఆయన తీరు చూసి సోనియానే సిగ్గుపడి పదవి ఇవ్వకపోతే.. తన తండ్రిని ఆమె చంపిందంటూ నిందలు వేసి బయటకు వెళ్లిపోయి సానుభూతి రాజకీయం చేశారు.
కాంగ్రెస్ ను నిలబెట్టిన రేవంత్ రెడ్డి – బతుకునిచ్చిన కాంగ్రెస్ ను చంపేసిన జగన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అండతో వేల కోట్లు సంపాదించుకుని అదే సొమ్ముతో కాంగ్రెస్ పార్టీని అంతం చేసిన లీడర్ జగన్ రెడ్డి. వైఎస్ సీఎం కాక ముందు లగడపాటి రాజగోపాల్ దగ్గర సబ్ కాంట్రాక్టుల కోసం ఆయన ఆఫీసులో గంటల తరబడి ఎదురు చూసిన జగన్ రెడ్డి వైఎస్ సీఎం అయ్యాక.. బెంగళూరులో మంత్రి మాల్స్ ను కూడా దక్కించుకునేంతగా ఎదిగారు. వేల కోట్లు సంపాదించుకున్నారు. ఇందిరమ్మ పేరు మీదనే మీడియా హౌస్ లు పెట్టారు. చివరికి ఆ అక్రమ సొమ్ముతోనే గాంధీ కుటుంబంపై విషం చిమ్మారు. చిమ్ముతూనే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం… ఒంటరిగా ఆ పార్టీలోకి వచ్చి ఎలాంటి ప్రయోజనాలను పొందకుండానే పార్టీ కోసం కష్టపడ్డారు. పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. ముఖ్యమంత్రి అవుతతున్నారు.
అందరి అభిమానాన్ని పొందిన రేవంత్ రెడ్డి – కొన్ని కులాలను ద్వేషించే జగన్ రెడ్డి
రేవంత్ రెడ్డి తెలంగాణ అందరి అభిమానాన్నిపొందారు. ఇంకా చెప్పాలంటే ఏపీ వాసుల అభిమానాన్ని కూడా పొందారు. అందుకే ఆయన వ్యక్తిత్వమే కారణం . తన ఉన్నతికి సహకరించిన చంద్రబాబును ఆయన పల్తెత్తు మాట అనరు. ఆయన చేసిన మేలేంటో తెలిసి కూడా రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శించడం సరి కాదని ఆయన భావన. అలాగే రేవంత్ అకారణంగా ఎవరినీ ద్వేషించరు. నిజమైన నాయకుడిగా వ్యవహరిస్తారు. జగన్ రెడ్డి… తాను రెడ్డిని కాబట్టి కమ్మ సామాజికవర్గాన్ని అంతం చేయడానికే పుట్టానని అనుకుంటారు. కులద్వేషంతో రగిలిపోతూంటారు. తన కు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అందుకే దుర్వినియోగం చేస్తున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తూ.. తాను కమ్మవారినే నాశనం చేస్తున్నాననే ఓ రకమైన ఊహాలోకంలో బతుకుతున్నారు. రేవంత్ రెడ్డి ట్రూ లీడర్ గా అందరి అభిమానాన్ని పొందుతూంటే… జగన్ రెడ్డి మాత్రం.. .ఎన్నో కులాలతో తిట్టించుకుంటున్నారు.
రెడ్లకు మాత్రమే మేలు చేయాలా ? పాలకుడిగా అందరికీ మేలు చేయాలా ? ఎలా చేస్తే ఐకాన్ లీడర్ !
జగన్ రెడ్డి కేబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వారి పేర్లు ఎవరికైనా గుర్తున్నాయి. ఎంతో మంది మంత్రులకు తమ శాఖలు ఏంటో కూడా తెలియదు. పదవులు ఇచ్చి వారిని నిమిత్త మాత్రులు చేసి పూర్తిగా అధికారం అంతా రెడ్ల చేతిలో పెట్టిన రాజకీయం జగన్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద దాడులు జరుగుతూంటే.. నిందితుల్ని తన పక్కన కూర్చోబెట్టుకునే తెంపరితనం. కానీ రేవంత్ రెడ్డి అలాంటి వాటిని ఎప్పుడూ ప్రోత్సహించిన దాఖలాల్లేవు. అందుకే జగన్ రెడ్డిని వ్యతిరేకించే కమ్మ సామాజికవర్గం రేవంత్ రెడ్డిని అభిమానిస్తుంది. ఆయనపై ఎలాంటి ద్వేషం చూపించదు. ఐకాన్ లీడర్షిప్ ఎవరికి ఉన్నట్లు ?
రెడ్డి ఐకాన్ అసలు లీడరే.. నకిలీ లీడర్ కాదు !
రెడ్డి అనేది ఓ కులం కాదు అనేది లోతుగా పరిశీలించిన వారికి తెలుస్తుంది. అందుకే రాయలసీమతో పాటు తెలంగాణలో చాలా చోట్ల వారిని కాపులంటారు. ఎందుకంటే.. పరిపాలిస్తారని అర్థం. పెదకాపు అనే పదాలు అందుకే పట్టాయి. కాపు ఎప్పుడు ఐకాన్ అవుతాడంటే.. అందర్నీ సమానంగా చూసినప్పుడు.. పాలనను ప్రజా నాయకుడిగా చేసినప్పుడు. అసలు రెడ్డి ఐకాన్ వారే. అంతే కానీ.. నకిలీ పాలనతో… ద్వేషపూరిత పాలనతో అందరితో చీ కొట్టించుకునేవారు నకిలీ రెడ్లే.
ఇప్పుడు రెడ్డి ఐకాన్ ఎవరు… నకిలీ ఎవరు అన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు.