సొంత ఇల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఓ కల. అయితే కొంత మంది సొంత ఇల్లు తీసుకుని అప్పుల భారం మోయడం ఎందుకని అనుకుంటుననారు. ఆర్థిక పరంగా తప్పుడు నిర్ణయంగా భావిస్తున్నారు. ఈఎంఐ కట్టుకునే బదులు…అందులో పావు వంతు రెంట్ కట్టుకుంటే లగ్జరీగా బతకవచ్చని.. ఎక్కడికి కావాలంటే అక్కడకు మారిపోవచ్చని ఆలోచిస్తున్నారు. ఆర్థిక పరంగా కూడా వారి ఆలోచనలు భిన్నంగా ఉంటున్నాయి. యాభై లక్షల లోన్ పెడితే.. పదిహేళ్ల పాటు ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది. అంటే కోటి రూపాయలు కట్టినట్లేనని అంత అవసర ఏముందని అనుకుంటున్నారు.
సొంత ఇల్లు వల్ల ప్రయోజనాలు అధికారం
కొత్త తరం సొంత ఇంటి విషయంలో చేస్తున్న ఆలోచనలు, అద్దె ఇళ్లకు ఇస్తున్న ప్రాధాన్యం విషయంలో భిన్న కోణాలు చూడాలని ప్రాపర్టీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా .. ఈఎంఐలు పెట్టుకుని కొనడం దండగ అని అనుకుంటే… అంత కంటే పిచ్చితనం ఉండదని అంటున్నారు. దానికి సేహేతుకమైన కారణాలు కూడా చెబుతున్నారు. ఇప్పుడు యాభై లక్షలు పెట్టి కొనుగోలు చేస్తే… పదిహేనేళ్ల తర్వాత ఆ ఇంటి విలువ కోటిన్నర అవుతుంది. ద్రవ్యోల్బణంతో పాటు.. రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధిని కలుపుకుంటే.. రాబోయే రోజుల్లో నగరాలు విపరీతంగా విస్తరిస్తాయి. అందుకే .. ఇళ్ల విలువ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు యాభై లక్షలు పెట్టి.. పదిహేళ్ల పాటు ఈఎంఐల ద్వారా కోటి కట్టినా… ఇంటి వాల్యూ కోటిన్నర అవుతుంది. అంటే.. యాభై లక్షల రూపాయల లాభమే ఉంటుంది.
అంతే కాదు ఇంటి అద్దె మిగులు !
అదే సమయంలో ఇంటి అద్దె మిగులుతుంది. అంటే.. పాతిక వేల ఇంటి అద్దె అనుకున్నా.. మూడులక్షల రూపాయలు ఆదా అవుతాయి. పదిహేనేళ్లకు నలభై ఐదు లక్షలు సేవ్ చేసుకున్నట్లే. అంటే… కట్టిన దాని కన్నా ఇంటి వాల్యూ పెరగడమే కాదు.. ఇంటి అద్దె సొమ్ము కూడా మిగులుతుంది. అంతే కాదు సొంత ఇల్లు కొనుక్కుంటే.. పన్ను మినహాయింపులు ప్రత్యేకంగా లభిస్తాయి. ఇల్లు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజుకు.. తర్వాత అసలు, వడ్డీకి కూడా మినహాయింపులు పొంద వచ్చు. ఇంటి అద్దె అలవెన్స్ కన్నా ఇది ఎక్కువగానే ఉంటుంది.
వేరే చోటకు షిఫ్ట్ అయినా అద్దె అదాయం
పెన్షన్ పథకాలు.. ఇతర స్కీముల్లో రిటైర్మెంట్ తర్వాత నికరమైన ఆదాయం వస్తుందని పెట్టుబడులు పెడుతూంటారు. అదే ఓ ఇల్లు కొనుగోలు చేస్తే.. రిటైర్మెంట్ తర్వాత ఆ ఇంట్లో ఉండకపోయినా ఆదాయం నిలకడగా వస్తుంది. ప్రతి సంవత్సరం… పెంచుకోవచ్చు. అంటే ఆదాయం పెరుగుతుంది. అంటే ఏ విధంగా చూసినా సొంత ఇల్లు అనేది ఓ పెద్ద అచీవ్ మెంటే కాదు.. గొప్ప పెట్టుబడి కూడా. అదే భారం అనుకుంటే.. నష్టపోయినట్లేనని అంటున్నారు. అద్దె ఇంటి కన్నా.. సొంత ఇల్లు వల్లే ఆర్థిక పరమైన ప్రయోజనాలు కూడా ఉంటాయని గుర్తు చేస్తున్నారు.