‘కథానాయకుడు’ రిజల్ట్… బాలయ్య అండ్ కోని గట్టిగానే దెబ్బకొట్టింది. అంచనాలన్నీ తలకింద్రులవ్వడంతో – చిత్రబృందం డీలా పడింది. అటు బయ్యర్లూ బాగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో పార్ట్ 2 చూడాలన్న ఆసక్తిని జనం లో పెంచడం అంత సామాన్యమైన విషయం కాదు. పార్ట్ 1లోనే గెటప్పులు రివీల్ అయిపోయాయి. జనాలకు అత్యంత ఇష్టమైన ‘సినిమా’ ఎపిసోడ్… పార్ట్ 1లోనే ముగిసింది. స్టార్లందరినీ ఆ భాగంలోనే చూసేశారు. మెలోడ్రామాకి ఏమాత్రం అవకాశం లేని పార్ట్ 2.. ఇప్పుడు ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకర్షిస్తుందన్నది అసలు ప్రశ్న.
పార్ట్ 2 (మహా నాయకుడు)ని జనరంజకంగా తీర్చిదిద్దడం క్రిష్ ముందున్న కీలకమైన సవాల్. పార్ట్ 1లో చేసిన తప్పుల్ని.. పార్ట్ 2లో రిపీట్ చేయకుండా ఉండాలనుకుంటున్నాడు క్రిష్. కథానాయకుడులో కొన్ని సన్నివేశాలు సుదీర్ఘంగా సాగాయి. కంటెంట్ బాగున్నా… లెంగ్త్ ఇబ్బంది పెట్టిన సీన్లు కొన్ని కనిపించాయి. అవి పార్ట్ 2లో లేకుండా జాగ్రత్త పడుతున్నాడు క్రిష్. ఆల్రెడీ తెరకెక్కించిన సన్నివేశాల్ని మరింత ట్రిమ్ చేయాలన్నది క్రిష్ ఆలోచన. అంతేకాదు.. ఇప్పటికే తీసిన కొన్ని సీన్లను మళ్లీ రీషూట్ చేస్తున్నట్టు ఇన్సైడ్ వర్గాల టాక్. తీసిన స్ననివేశాన్ని కుదించడం అన్ని వేళలా సాధ్యం కాదు. అందుకే మరింత షార్ప్‌గా సీన్రాసుకుని. దాన్ని ఇప్పుడు మళ్లీ రీషూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ అంతిమయాత్రని `మహానాయకుడు`లో చూపించాలన్న ఉద్దేశం చిత్రబృందానికి లేదు. కానీ.. ఇప్పుడు ఆ సన్నివేశాల్ని కూడా జోడిస్తున్నార్ట. చిత్రీకరణలో జాప్యం వల్లే… ఈనెల 14న రావాల్సిన ఈ చిత్రం 22కి వాయిదా పడిందని సమాచారం.