ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు కియా మోటార్స్ తన ప్లాంట్‌ను తరలించేందుకు సన్నాహాలు చేస్తోందని… సంచలన వార్తా కథనం రాసిన రాయిటర్స్.. ఆ కథనానికి కట్టుబడి ఉంది. కాకపోతే కొంచెం కరెక్షన్ చేసింది. ఈ కరెక్షన్.. రాయిటర్స్ తన స్టోరీలో ఉన్న గందరగోళాన్ని తగ్గించేందుకే చేసింది. ఈ సారి మరింత క్లారిటీగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కియా వెళ్లిపోతోందని… నేరుగా చెబుతోంది. రెండు రోజుల క్రితం..రాయిటర్స్ రాసిన కథనంలో.. కియా ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోందని… రాశారు. ఇప్పుడు.. ఆ గందరగోళానికి తెరదించి.. నేరుగా… ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోతోందని చెప్పేశారు. ఆ మేరకు కరెక్షన్ ట్వీట్ చేశారు.
రాయిటర్స్ కియా మోటార్స్‌పై రాసిన కథనాన్ని వెనక్కి తీసుకుందని… ఆ మేరకు కరెక్షన్ ట్వీట్ పెట్టిందని సాక్షి మీడియా ప్రచారం ప్రారంభించింది. సాక్షికి ఇంగ్లిష్ సరిగ్గా రాక… అలా అర్థం చేసుకున్నారో లేక.. అలా రాయమని.. ఎవరైనా ప్రోత్సహించారో కానీ… నిజాన్ని దాచి పెట్టేశారు. సోషల్ మీడియాలో కొంత మంది రాయిటర్స్ క్రెడిబులిటి దెబ్బతిన్నదని చెబుతూ.. చెలరేగిపోతున్నారు. తెలుగు మీడియాలో సవరణ అని వస్తే… ఆ సవరణ దేనికి సంబంధించి ఆ కథనం తప్పు అనే ఓ భావన ఉంది. అందుకే.. రాయిటర్స్ “కరెక్షన్” అని ట్వీట్ పెట్టి… కియా మోటార్స్ కథనం గురించి ప్రస్తావించగానే… ఆ కథనాన్ని వెనక్కి తీసుకుందని అనుకుంటున్నారు. కానీ.. మరింత క్లారిటీ ఇచ్చినట్లయింది.
రాయిటర్స్ తన కథనంలో హెడ్‌లైన్‌ను మాత్రమే కొద్దిగా మార్చింది. ఏమి మార్చామో.. ఎందుకు మార్చామో.. కథనం చివర చెప్పింది. ఈ కథనంలో తను చెప్పిన దానికి రాయిటర్స్ పూర్తిగా కట్టుబడి ఉందని దీని ద్వారా స్పష్టమవుతోంది. కరెక్షన్ అని ట్వీట్ పెట్టి.. పాత ట్వీట్ ను డిలీట్ చేసే సరికి.. అసలు కథనమే వెనక్కి తీసుకుందన్న ఉత్సాహంలో… కొంత మంది ఉన్నారు. నిజానికి రాయిటర్స్.. తన కథనంలో.. కియా పరిశ్రమ ఏపీ నుంచి వెళ్లిపోతోందని చెబుతోంది.